మోదకొండమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-29T06:17:49+05:30 IST

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ జారత పనులు ప్రారంభమ య్యాయి. వచ్చే నెల ఏడో తేదీన ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో రెండురోజుల నుంచి విద్యుద్దీపాలంకరణ పనులు చేపడుతున్నారు.

మోదకొండమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభం
భారీ సెట్‌ వేసేందుకు కర్రలు అమర్చుతున్న దృశ్యం


మాడుగుల, మే 28 : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ జారత పనులు ప్రారంభమ య్యాయి. వచ్చే నెల ఏడో తేదీన ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో రెండురోజుల నుంచి విద్యుద్దీపాలంకరణ పనులు చేపడుతున్నారు.  గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా జాతర జరగకపోవడంతో ఈ ఏడాది భారీగా నిర్వహించాలన్న సంకల్పంతో ఆలయ కమిటీ ప్రతినిధులు ఉన్నారు. జాతర రోజు ఎనిమిది వేదికల ద్వారా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.  ఒకటో తేదీ ఏంచి శతకంపట్టు వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ మాడుగులలో జరుగుతోంది. అలాగే రాష్ట్రస్థాయి మహిళ కబడ్డీ పోటీలు కూడా కమిటీ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2022-05-29T06:17:49+05:30 IST