అందాల పోటీ విజేత చెన్నై హిజ్రా సాధన

ABN , First Publish Date - 2022-04-19T16:48:15+05:30 IST

విల్లుపురం కలైంజర్‌ అరివాలయంలో ఆదివారం రాత్రి హిజ్రాల అందాలపోటీల్లో చెన్నైకి చెందిన హిజ్రా సాధన మొదటిస్థానం విజేతగా నిలిచింది. తక్కిన రెండు స్థానాల్లోనూ చెన్నై

అందాల పోటీ విజేత చెన్నై హిజ్రా సాధన

చెన్నై: విల్లుపురం కలైంజర్‌ అరివాలయంలో ఆదివారం రాత్రి హిజ్రాల అందాలపోటీల్లో చెన్నైకి చెందిన హిజ్రా సాధన మొదటిస్థానం విజేతగా నిలిచింది. తక్కిన రెండు స్థానాల్లోనూ చెన్నైకి చెందిన హిజ్రాలు మధుమితా, ఎలిషా బహుమతులు గెలుచుకున్నారు. కళ్లకుర్చి జిల్లా ఉళుందూరుపేట సమీపంలోని కూవాగం గ్రామంలో కూత్తాండవర్‌ ఆలయంలో ప్రతియేటా దేశవిదేశాలకు చెందిన హిజ్రాలంతా పాల్గొనే చిత్తిరై వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ మేరకు ఈ నెల ఐదు నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హిజ్రాలకు అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే ఎంపీ తిరుచ్చి శివా, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఎంపీ దురై రవికుమార్‌, శాసనసభ్యులు పుగళేంది, డాక్టర్‌ లక్ష్మణన్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యురాలు నర్తకి నటరాజ్‌, నటుడు సూరి తదితరులు హాజరయ్యారు. ఈ పోటీల్లో చెన్నై, సేలం, ఈరోడ్‌, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, విల్లుపురం, నామక్కల్‌, తంజావూరు, తూత్తుకుడి, తిరునల్వేలి, తిరుప్పూరు, నీలగిరి తదితర జిల్లాలకు చెందిన సుమారు 200 మంది హిజ్రాలు పాల్గొన్నారు. ఇందులో చెన్నైకి చెందిన సాధన మొదటి స్థానం, మధుమితా, ఎలిషా రెండు, మూడు స్థానాలను గెలుచుకున్నారు. విజేత సాధనకు కిరీటాన్ని ధరింపజేశారు. 

Updated Date - 2022-04-19T16:48:15+05:30 IST