మంత్రి గారిని హనీట్రాప్ చేసేందకు కుట్ర.. ఆయనతో ఒక రాత్రి గడపాలని ఓ ప్రముఖ మోడల్‌కు ఆఫర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-11T06:05:13+05:30 IST

ఒక రాష్ట్ర మంత్రిని బ్లాక్ మెయిల్ చేసేందుకు దండుగులు ఒక ప్లాన్ వేశారు. ఆయనను ఒక మోడల్ చేత హనీట్రాప్‌లో ఇరికించాలనుకున్నారు. అందుకోసం ముందుగా ఆ ప్రముఖ మోడల్‌కు డబ్బు ఆశ చూపి మంత్రిగారితో ఒక రాత్రి గడపాలని చెప్పారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ దుండగులు ఆమెను బ్లాక్ మెయిల్...

మంత్రి గారిని హనీట్రాప్ చేసేందకు కుట్ర.. ఆయనతో ఒక రాత్రి గడపాలని ఓ ప్రముఖ మోడల్‌కు ఆఫర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..

ఒక రాష్ట్ర మంత్రిని బ్లాక్ మెయిల్ చేసేందుకు దండుగులు ఒక  ప్లాన్ వేశారు. ఆయనను ఒక మోడల్ చేత హనీట్రాప్‌లో ఇరికించాలనుకున్నారు. అందుకోసం ముందుగా ఆ ప్రముఖ మోడల్‌కు డబ్బు ఆశ చూపి మంత్రిగారితో ఒక రాత్రి గడపాలని చెప్పారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ దుండగులు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ఏం చేశారంటే..


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ నగరానికి చెందిన గున్ గున్ ఉపాధ్యాయ్ అనే యువతి మోడలింగ్ రంగంలో ఒక ప్రముఖ మోడల్‌గా స్థిరపడింది. ఇటీవల అక్షత్ శర్మ, దీపాలీ అనే ఇద్దరు మోడలింగ్ ఏజెన్సీ వ్యక్తులు ఆమెను కలిశారు. ఆ ఇద్దరూ గున్ గున్ మోడలింగ్ ప్రారంభం రోజుల్లో ఆమెను మోడల్‌గా పరిచయం చేశారు. ఆ సంబంధంతో గున్ గున్ చేత ఒక పని చేయించాలనుకున్నారు. రాజస్థాన్ మంత్రి రామ్‌లాల్ జాట్‌తో గున్ గున్ ఒక రాత్రి గడపాలని అందుకోసం ఆమెకు తగిన డబ్బు ఇస్తామని చెప్పారు. కానీ గున్ గున్ అందుకు ఒప్పుకోలేదు. 


ఆ తరువాత అక్షత్ శర్మ, దీపాలీ మరోసారి గున్ గున్‌తో మాట్లాడారు. ఈ సారి ఆమెను తాము చెప్పిన పని చేయాలని బెదిరించారు. చేయకపోతే.. ఆమె మోడలింగ్ తొలి రోజుల్లో చేసిన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో గున్ గున్ భయపడింది. వారు చెప్పినట్లు చేయడానికి అయిష్టంగా అంగీకరించింది. 


అలా దీపాలీ చెప్పినట్లు మంత్రి గారిని కలవడానికి రాజస్థాన్‌లోని భిల్వాడా నగరంలో ఉండే ఒక హోటల్‌కు చేరుకుంది. అక్కడ రాత్రి సమయంలో మంత్రి గారి గదికి వెళ్లాలి.. కానీ గున్ గున్ ఆ పనిచేయడానికి భయపడిపోయింది. వెంటనే ఎవరికీ చెప్పకుండా జోధ్‌పూర్ తిరిగి వచ్చేసింది. ఈ విషయం తెలిసిన దీపాలీ.. గున్ గున్‌కు ఫోన్ చేసి వెంటనే తిరిగి రావాలని లేకపోతే 24 గంటల్లో ఆమె న్యూడ్ ఫొటోలు వైరల్ చేస్తానని చెప్పింది. ఇది విన్న గున్ గున్ ఇక తన జీవితం నాశనమైపోతుందని భావించి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. వెంటనే తను ఉన్న బిల్డింగ్ కిటికీ నుంచి కిందికి దూకేసింది.

 

చుట్టుపక్కల ఉన్న వారు గున్ గున్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గున్ గున్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకొని నిందితులు అక్షత్ శర్మ, దీపాలీని అరెస్టు చేశారు. 


పోలీసుల కథనం ప్రకారం.. వీరిద్దరూ గున్ గున్, మంత్రి గారిని ఒక రాత్రి ఒక గదిలో పెట్టి వారి మధ్య జరిగిన శ‌ృంగార దృశ్యాలను చిత్రీకరించాలనుకున్నారు. వాటితో మంత్రి గారిని బ్లాక్ మెయిల్ చేసి తమకు కావాల్సిన బడా పనుల చేయించుకోవాలని ప్లాన్ వేశారు. అంతకు ముందు నిందితుడు అక్షత్ శర్మ రాజస్థాన్‌కు చెందిన ఒక పెద్ద డాక్టర్‌ను ఇలాగే బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.


Updated Date - 2022-02-11T06:05:13+05:30 IST