నేడు మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-01T15:19:28+05:30 IST

మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులకు..

నేడు మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌

అమరావతి: మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులకు మంగళవారం కౌన్సెలింగ్‌ జరుగుతుందని పాఠశాల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్‌ నియామకాలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను  హైకోర్టు కొట్టేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికై సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు డిసెంబరు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌  కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన కోరారు. 


Updated Date - 2020-12-01T15:19:28+05:30 IST