మోకాళ్ల నొప్పులకు ఆపరేషన్‌లేని ఆధునిక చికిత్స!

Mar 10 2020 @ 14:46PM

దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమంగా మోకాళ్ల నొప్పులకు మోకాళ్ల మార్పిడి అవసరం లేకుండా సమర్థమైన ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్స!


వయసు మళ్లిన వాళ్లలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. ఈ సమస్య వారిని తీవ్రమైన నొప్పితో వారి జీవితం పట్ల నిరాశతో కూడిన పరిణామాలకు దారి తీస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులకు వారి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందే విధంగా నూతన వైద్యవిధానం ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్‌పీ) ఇపియాన్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ (హైదరాబాద్‌) అందుబాటులోకి తెచ్చింది. ఈ చికిత్సా విధానంలో పేషెంట్‌ రక్తంలోని ప్లాస్మాను సంగ్రహించి ఈ సమస్యతో బాధపడుతున్న వారి మోకాలు భాగంలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు.


పీఆర్‌పీ చికిత్సతో ఎవరికి లాభం?

వయసుతో సంబంధం లేకుండా పీఆర్‌పీ చికిత్సా విధానంతో ఎవరైనా లబ్ది పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు మనం ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా 45 ఏళ్ల వయసు, అంతకుమించి పైబడిన వారిలో ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. యువకుల్లో అత్యధికంగా క్రీడాకారుల్లో, గాయాలతో మరియు అధిక బరువుతో బాధపడే స్థూలకాయుల్లో మోకాళ్ల నొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు వయసుతో సంబంధం లేకుండా పీఆర్‌పీ చికిత్సా విధానంతో లబ్ది పొందవచ్చు. 


పీఆర్‌పీ చికిత్స ఎలా పని చేస్తుంది?

ప్లేట్‌లెట్స్‌ శరీరంలో ఉండే చిన్న కణాలు. ఇవి రక్తం గడ్డకట్టే ప్రక్రియలో పాల్గొంటాయి. దెబ్బతిన్న ప్రదేశంలోకి ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా ఇంజెక్ట్‌ చేసిన తర్వాత వృద్ధికారకాలు ప్రేరేపించబడతాయి. ఈ విధంగా మొత్తం కణజాలం మళ్లీ పునరుత్పత్తి కాబడుతుంది. 


పీఆర్‌పీ చికిత్స వల్ల లాభాలు!

పీఆర్‌పీ చికిత్స కేవలం 30 నిమిషాల్లో పూర్తి అవుతుంది. మోకాళ్ల మార్పిడి తరహాలో నొప్పి కానీ, రక్తస్రావం కబానీ ఈ చికిత్సా విధానంలో ఉండవు. పీఆర్‌పీ చికిత్స పొందిన రోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చికిత్స పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. ఈ చికిత్స ప్రధాన ప్రయోజనం ఏంటంటే, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా చిన్న ఇంజెక్షన్‌ ద్వారా ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ చికిత్స ప్రారంభం నుంచే నొప్పి తగ్గుముఖం పట్టి, మీ పనిని పునరుద్ధరించుకోవచ్చు.


మోకాలు చికిత్స కోసం ఉన్న ఇతర చికిత్సా పద్ధతులు ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా విధానం కంటే సమర్ధవంతమైనదని నిరూపించబడలేదు. దీనికి బెడ్‌ రెస్ట్‌ అవసరం లేదు. ఇది మోకాలి కీళ్ల సమస్యలను నివారించడానికి మరియు మోకాలి నొప్పిని తొలగించడానికి సహజమైన మార్గం.


పీఆర్‌పీ లాంటి ఆధునిక చికిత్సా విధానం అందుబాటులోకి తెచ్చిన ఇపియాన్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌లో మోకాలి నొప్పులు, నడుము నొప్పి, మైగ్రెయిన్‌ తలనొప్పి, స్పాండిలైటీస్‌, సయాటికా మరియు అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు సర్జరీ అవసరం లేని ఆధునిక చికిత్సలు లభిస్తాయి.- డాక్టర్‌ సుధీర్‌ దారా

ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇపియాన్‌ ఇంటర్వెన్షనల్‌ పెయిన్‌ స్పెషలిస్ట్‌,

4వ అంతస్తు, అపురూప పిసిహెచ్‌,

రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌,హైదరాబాద్‌.

కాల్‌: 8466044441, 040 48554444

www.epionepainandspine.com

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.