శ్మశానవాటికల ఆధునికీకరణ

ABN , First Publish Date - 2022-10-05T06:04:42+05:30 IST

ఆఖరి మజిలీకి కష్టాలు తీరనున్నాయి. గతం లో జిల్లా కేంద్రంలో ఎవరైనా మృతి చెందింతే దహన సంస్కారాలకు ఇబ్బం దులు ఎదురయ్యేవి.

శ్మశానవాటికల ఆధునికీకరణ
జగిత్యాలలోని ఆధునీకరించిన చింతకుంట శ్మశాన వాటిక

   చివరి మజిలీకి సకల సౌకర్యాలు

   రూ. 1.15 కోట్ల నిధులతో పనులు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 4: ఆఖరి మజిలీకి కష్టాలు తీరనున్నాయి. గతం లో జిల్లా కేంద్రంలో ఎవరైనా మృతి చెందింతే దహన సంస్కారాలకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కే టాయిం చి శ్మశాన వాటికలను నిర్మించి అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని హంగు లతో శ్మశాన వాటికను ఆధునీకరించేలా బల్దియా ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. టీయూ ఎఫ్‌ఐడీసీ నిధులు రూ. 75 లక్షలు, 14వ, ఆర్థిక సంఘం నిధులు రూ. 20 లక్ష లు, పట్టణ ప్రగతి నిధులు రూ. 20 లక్షలతో పట్టణంలోని శ్మశాన వాటికలను ఆధునీకరించారు. అఖరి మజిలీలో వారికి కుటుంబ సభ్యులు సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంప్కారాలు నిర్వహించి గౌరవ ప్రదంగా సాగనం పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శ్మశాన వాటికలకు మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంది. అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు మృతి చెందిన సమయంలో  పడు తున్న ఇబ్బందులు తొలిగిపోయే విధంగా ప్రత్యేక సౌకర్యాలు చేపట్టారు. కరోనా కష్ట కాలంలో ఆధునీకరించిన శ్మశాన వాటిక నిరుపేదలకు నీడనించి ఎంతో ఉపశమనం కలిగించేలా వసతులును కల్పించారు.

 రూ. 75 లక్షలతో ప్రత్యేక గదుల నిర్మాణం...

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా అద్దె ఇళ్లలోనే ఎక్కువ మంది జీవనం సాగి స్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నాయి. ప్రమాదంలోగాని ఆనారోగ్యంతో కాని అద్దె ఇంటిలో వారు అనుకోకుండా మృతి చెందిన సందర్బాల్లో మృత దేహాన్ని ఇంటికి రానివ్వని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని అధిగ మించేలా జగిత్యాలలోని శ్మశాన వాటికలను రూ. 75 లక్షల నిధులతో ఆధుని కరించారు. ఇందులో మార్చురి గది,  పూజ గది, ఇల్లు లేనివారు ఉండేందుకు గాను మూడు ప్రత్యేక గదులు, వంట గది, భోజన షెడ్డు, అస్తికలు బధ్రపరిచే గది ఇలా అన్ని సౌకర్యాలతో ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా రూ. 1 లక్ష నిధులను కేటాయించి శివుని ప్రతిమను కుడా ఏర్పాటు చేశారు.

రూ. 20 లక్షలతో సౌకర్యాలు

చింతకుంట స్మశాన వాటికలో 14వ, ఆర్థిక సంఘం నిధులు రూ. 20 లక్షల తో సకల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా స్నానాల గదులతో పాటు మరుగుదొడ్లు నిర్మించారు. హరితహారంలో భాగంగా శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. దీంతో పాటు పట్టణ ప్రగతి నిధులు రూ. 20 లక్షలతో గ్యాస్‌ క్రిమిటోయాన్ని ఏర్పాటు చేశారు. అతి తక్కువ ఖర్చుతో గ్యాస్‌ క్రిమిటోరియం ద్వారా చివరి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి సేవలందించేలా చర్యలు చేపట్టారు.

శ్మశాన వాటికల్లో అన్ని వసతులు

- సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

గౌరవ ప్రదంగా హిందూ సాంప్రదాయ ప్రకారం శ్మశాన వాటికలను ఆధు నీకరించాం. అన్ని వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి అభివృద్ధికి నిధులు కేటాయించింది. చివరి మజిలీకి గౌరవప్రదమైన  వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. జగిత్యాలలో శంకర్‌ ఘాట్‌తో పాటు హరిశ్చం ధ్ర, చింతకుంట శ్మశాన వాటికలను ఆధునీకరించాం.

వసతులపై ప్రత్యేక దృష్టి

- బోగ శ్రావణి, చైర్‌ పర్సన్‌, జగిత్యాల బల్దియా

చింతకుంట శ్మశాన వాటికకు వచ్చే వారికి చివరి మజిలికి ఏలాంటి ఇబ్బం దులు కలుగకుంగా అన్ని వసతులు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా అద్దె ఇంటి కష్టాలు ఉన్న వారికి  కర్మకాండలు పూర్తయ్యే వరకు ఉండేలా ప్రత్యేక గదులు నిర్మించాం. తక్కువ ఖర్చుతో గ్రాస్‌ క్రిమిటోరియం కూడా ఏర్పాటు చేశాం.

Updated Date - 2022-10-05T06:04:42+05:30 IST