మోదీ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2020-12-04T05:00:56+05:30 IST

రైతులపై నిరంకుశంగా వ్యహరిస్తోన్న మోదీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని సీపీఎం నాయకుడు, రైతు సంఘ పశ్చిమ ప్రాంత జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి అన్నారు.

మోదీ పాలనకు చరమగీతం పాడాలి
సీపీఎం నేత హనీఫ్‌ను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు


కనిగిరి, డిసెంబరు 3 : రైతులపై నిరంకుశంగా వ్యహరిస్తోన్న మోదీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని సీపీఎం నాయకుడు, రైతు సంఘ  పశ్చిమ ప్రాంత జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి అన్నారు. పట్టణంలో పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో గురువారం ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు కేశవరావు, మాలకొండయ్య, కాశయ్య, ప్రసన్న, రమణమ్మ పాల్గొన్నారు.  

పామూరులో..

పామూరు : రైతులకు నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పశ్చిమ ప్రకాశం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌డీ హనీఫ్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారిపై గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్వేచ్ఛ వ్యవసాయం పేరుతో బీజేపీ ఫ్రభుత్వం కార్పోరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తుందని హనీఫ్‌ విమర్శించారు. ఆందోళనతో వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌ సిబ్బందితో వచ్చి చెదగొట్టే ప్రయత్నం చేశారు. హనీఫ్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  కార్యక్రమంలో కె.మాల్యాద్రి, షేక్‌ ఖాదర్‌బాషా, అల్లాభగష్‌, మహదేవయ్య, వీరనారాయణ, ఖాసీం సాహెబ్‌, అంకయ్య, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.  

రైతులకు మద్దతుగా రాస్తారోకో

మార్కాపురం(వన్‌టౌన్‌) : ఢిల్లీలో వారం రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మార్కాపురంలోని 565 జాతీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా  ఆపార్టీ కార్యదర్శి డి.సోమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా  రైతుల డిమాండ్లను ఆమోదించాలని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీకేఎం రఫి మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే విధానాలను మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం,  వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తర్లుపాడులో..

తర్లుపాడు :  ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా తర్లుపాడు బస్టాండ్‌ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఏరువ పాపిరెడ్డి మాట్లాడగా రైతు సంఘం నాయకులు కోలగట్ల శ్రీనివాసులురెడ్డి, కుందూరు చిన్నకాశిరెడ్డి, గోసు వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాసులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

రాస్తారోకో

ముండ్లమూరు : ఢిల్లీలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడానికి నిరసనగా వామపక్ష నాయకులు గురువారం స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు వెల్లంపల్లి ఆంజనేయులు, సుంకర అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రద్దుచేయాలని లేకుంటే భూమి నుంచి రైతులు దూరం అవుతారని అన్నారు.  రాస్తారోకో చేస్తున్న వామపక్ష నేతలను ముండ్లమూరు ఏఎస్సై బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసి వ్యక్తిగత పూచికత్తుపై వదిలివేశారు రాస్తారోకో సందర్భంగా అద్దంకి - దర్శి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సుంకర అంజిరెడ్డి, బోడపాటి హనుమంతరావు, పంటా ఏడుకొండలు, సలోను, నాగరాజు, యర్రయ్య, మీరావలీ, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

సీఎస్‌పురంలో..

సీఎస్‌పురం : వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఊసా వెంకటేశ్వర్లు, కర్నా ఓబుల్‌రెడ్డి, షేక్‌.అజీద్‌బాషా, ఎం.రత్నారెడ్డి,  రాజ్యలక్ష్మి, ఎస్‌.తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:00:56+05:30 IST