నేను చెప్పాను, మోదీ చేశారు: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-26T18:16:15+05:30 IST

దేశంలో ఎక్కువ మంది ప్రజలకు టీకా అందలేదని, టీకా కార్యక్రమం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. ఇక బూస్టర్ డోస్ ఎప్పుడు వేస్తారంటూ మోదీ ప్రభుత్వాన్ని ఏద్దేవా చేశారు. డిసెంబర్ 22న రాహుల్ ఈ ట్వీట్ చేశారు..

నేను చెప్పాను, మోదీ చేశారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కొవిడ్-19 వేరియంట్లను తట్టుకుని ఆరోగ్యంగా ఉండేందుకు దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని తాను చేసిన సూచనని మోదీ ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం వేసిన ఒక మంచి అడుగు ఇదేనని, దీంతో దేశ ప్రజలందరికీ వ్యాక్సీన్ అందనుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో జనవరి 3 నుంచి టీకా కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని, ఈసారి బూస్టర్ డోస్‌ను కూడా అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోది శనివారం ప్రకటించారు. దీనిపై రాహుల్ గాంధీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వాదా స్పందించారు.


దేశంలో ఎక్కువ మంది ప్రజలకు టీకా అందలేదని, టీకా కార్యక్రమం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. ఇక బూస్టర్ డోస్ ఎప్పుడు వేస్తారంటూ మోదీ ప్రభుత్వాన్ని ఏద్దేవా చేశారు. డిసెంబర్ 22న రాహుల్ ఈ ట్వీట్ చేశారు. కాగా, తాజాగా బూస్టర్ డోస్ అందించనున్నట్లు కేంద్రం ప్రకటించడంపై రాహుల్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘కేంద్ర ప్రభుత్వం నా సలహాను అంగీకరించింది. ఇదొక మంచి ముందడుగు. దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సీన్/బూస్టర్ రక్షణ అందుతుంది’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-12-26T18:16:15+05:30 IST