మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

ABN , First Publish Date - 2022-07-02T06:22:42+05:30 IST

దేశంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య అన్నారు.

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
అభివాదం చేస్తున్న నాయకులు

రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై పార్లమెంటులో చట్టం చేయాలి 

రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య

అట్టహాసంగా ప్రారంభమైన రైతుసంఘం రాష్ట్ర ద్వితీయ సభలు

హుజూర్‌నగర్‌ , జూలై 1: దేశంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు మొదటిరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో మట్టపల్లి బైపాస్‌ రోడ్డు నుంచి ఇందిరాసెంటర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పబ్లిక్‌ క్లబ్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. దీనిపై పార్లమెంటులో ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్‌చేశారు. స్వామి నాథన్‌ సిఫారసు లు అమలుకు నోచుకోలేదన్నారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేసే విధంగా మోదీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోవాలన్నారు. కార్మిక లేబర్‌ చట్టాలను కూడా మోదీ రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులను అన్ని విధాల మోసం చేశారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. పండిన పంటలు అమ్ముకు న్న తర్వాత ప్రభుత్వం మేము పంటను కొంటామని ముందుకు వస్తే ఏలాంటి ఉపయోగం ఉండదన్నారు. మద్దతు ధర రైతులకు అందడం లేదని మిల్లర్లు, వ్యాపారులకు అందిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో కళాకారులు, కార్మికులు, మహిళలు కోలాట ప్రదర్శన చేశారు. రెడ్‌ షర్ట్‌ల తో కవాతుచేశారు. మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర మహసభలతో హుజూర్‌నగర్‌ అరుణవర్ణం సంతరించుకుంది. బహిరంగ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, గన్నా చంద్రశేఖర్‌, బొ మ్మగాని ప్రభాకర్‌రావు, భాగం హేమంత్‌రావు, బెజవాడ వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, కంబాల శ్రీనివాస్‌; కొప్పోజు సూర్యనారాయణరావు, పాలకూరి బాబు, ఉమ, ధనుంజయనాయుడు, ఎం.వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, రమేష్‌, బాదె నర్సయ్య, దొంతగాని సత్యనారాయణ, సుందరి పద్మ, మల్లేశ్వరి, ఉమ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T06:22:42+05:30 IST