మోదీ తప్పుడు ఆలోచనే అగ్నిపథ్‌

ABN , First Publish Date - 2022-06-28T04:37:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తప్పు డు విధానం వల్లే అగ్నిపథ్‌ పథకం పుట్టుకొచ్చిందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనా రెడ్డి అన్నారు.

మోదీ తప్పుడు ఆలోచనే అగ్నిపథ్‌
ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

- యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి

- దోపిడీ దారులపై ఉన్న ప్రేమ దేశ యువతపై ఎందుకు లేదు 

- భారత రక్షణ వ్యవస్థతో బీజేపీ ఆటలాడుతోంది : మాజీ మంత్రి చిన్నారెడ్డి

- జై జవాన్‌ జై కిసాన్‌కు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది

వనపర్తి టౌన్‌, జూన్‌ 27: కేంద్ర ప్రభుత్వం తప్పు డు విధానం వల్లే అగ్నిపథ్‌ పథకం పుట్టుకొచ్చిందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్‌ కు మార్‌ అధ్యక్షతన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శివసేనారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి హజర య్యారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు, శత్రువుల నుంచి  దేశాన్ని రక్షించే భారత సైన్యంపై బీజేపీ ప్రభుత్వా నికి ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఆర్మీ ఉద్యోగాల కోసం యువత  అనేక సంవత్సరాలుగా ఎదురుచూ స్తున్న తరుణంలో అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చి వారి ఆశయాలపై నీళ్లు చల్లాలని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. రాహుల్‌ గాంధీ ఆదేశాలు, రేవంత్‌రెడ్డి సలహాలతో అగ్నిపథ్‌ పథకం రద్దు చేసే వరకు యూత్‌ కాంగ్రెస్‌ పోరాడు తూనే ఉంటుందని అన్నారు. 

మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ గుజరాత్‌ రాష్ట్రం అంటేనే ఆర్మీలో చేరడానికి ఇష్టపడరని, వ్యా పారం చేసుకోవడమంటేనే ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్కు వ మక్కువని అన్నారు. అలాంటి రాష్ట్రం నుంచి వచ్చిన నరేంద్రమోదీకి దేశ రక్షణ గురించి ఏం తెలు స్తుందని విమర్శించారు. దేశ యువతకు దేశభక్తి ఎక్కువగా ఉంటుందని, అలాంటి వారికి ఆర్మీలో నాలుగు సంవత్సరాల కాలపరిమితి విధించి ఉద్యోగం చేయమని ఆంక్షలు పెట్టడం మూర్ఖత్వమన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ జైజవాన్‌ జైకిసాన్‌ నినాధానికి కట్టుబడి ఉందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో కొల్లాపుర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రంగినేని అభిలాష్‌రావు, జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, తిరుపతయ్య, జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీలత, చీర్ల జనార్ధన్‌, సతీష్‌ యాదవ్‌, మన్నెం కొండ, శివశంకర్‌ యాదవ్‌, రొయ్యల రమేష్‌, ఆవుల రమేష్‌ తదితరు లు పాల్గొన్నారు. 

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు   

 అమరచింత : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు దాసోహం పలుకుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అమరచింత మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రశాంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జవాన్లను కాంట్రాక్టు పద్ధతి ద్వారా నాలుగు ఏండ్లు కొనసాగించేందుకు తెచ్చిన అగ్నిపథ్‌ సరైంది కాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ పాలన సాగిస్తున్నదని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.    కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, మాజీ ఎంపీటీసీ మహంకాల విష్ణు, కాంగ్రెస్‌ కిసాన్‌ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌, జుబేర్‌, ప్రకాశం, మన్నన్‌, కె.సత్యారెడ్డి, విష్ణు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-06-28T04:37:33+05:30 IST