
హైదరాబాద్ సిటీ : ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Minister Talasani) హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం 10 మందికి గోల్డ్‌మెడల్స్, పట్టాలు ప్రధాని అందజేయనున్నారు. ఆ తర్వాత ISB ఆవరణలో మోదీ మొక్క నాటనున్నారు. కాగా.. మొత్తం భాగ్యనగరంలో రెండున్నర గంటలపాటు మోదీ పర్యటన జరగనుంది.
ఇవి కూడా చదవండి