First ITI convocation: యువతకు మోదీ అభివృద్ధి మంత్రం

ABN , First Publish Date - 2022-09-17T22:44:29+05:30 IST

మారుతున్న కాలానికి తగినట్లుగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని ప్రధాన

First ITI convocation: యువతకు మోదీ అభివృద్ధి మంత్రం

న్యూఢిల్లీ : మారుతున్న కాలానికి తగినట్లుగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) యువతకు పిలుపునిచ్చారు. నైపుణ్యాన్ని సాధించి, దానికి సానబెట్టి, దానిని మరింత పెంచుకోవాలని చెప్పారు. ‘స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్’ (Skilling, Reskilling and Upskilling)  మంత్రాన్ని ఆచరించాలని తెలిపారు. 


పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ITIs) మొదటి స్నాతకోత్సవం (Convocation)లో మోదీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి తగినట్లుగా నవ కల్పన (Innovation) చేయాలని, అందుకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మారుతున్న అవసరాలకు తగినట్లుగా యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ‘స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్’ మంత్రాన్ని అనుసరించాలన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో తాజా పరిణామాలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. 


మన దేశంలో మొదటి ఐటీఐని 1950లో ఏర్పాటు చేశారని, ఇప్పుడు వీటి సంఖ్య 10,000కు పెరిగిందని చెప్పారు. తన ప్రభుత్వ హయాంలో 5,000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశామని చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో ఐటీఐల్లో కొత్తగా 4 లక్షలకుపైగా సీట్లు జత కలిశాయని తెలిపారు.  అనుభవం ఆధారంగా నేర్చుకునే విధానాన్ని నూతన విద్యా విధానంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 


దేశంలో కొత్తగా 5,000 స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధనం, సౌర విద్యుత్తు, విద్యుత్తు వాహనాలు వంటివాటిలో మన దేశం ఏ విధంగా ముందంజలో ఉందో మీరంతా చూస్తున్నారని అన్నారు. 


Updated Date - 2022-09-17T22:44:29+05:30 IST