
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు నిలయమైన లఖింపూర్ ఖేరి జిల్లాతోపాటు 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కేంద్రమంత్రి కుమారుడు కారుతో ఢీకొట్టి రైతులను హతమార్చిన ఘటన, తదనంతరం జరిగిన అల్లర్లతో లఖింపూర్ ఖేరి జాతీయవార్తల్లోకి ఎక్కింది. యూపీ నాలుగో దశ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓటర్లకు పిలుపునిచ్చారు.

‘‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు నాలుగో రౌండ్ పోలింగ్ జరుగుతోంది. ఓటర్లందరూ తమ విలువైన ఓట్లను వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమవంతు సహకారం అందించాలని అభ్యర్థిస్తున్నాను.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ హిందీలో ట్వీట్ చేశారు.