మోదుకూరి రచనలు సమసమాజానికి బాటలు

ABN , First Publish Date - 2022-08-09T06:00:34+05:30 IST

అగ్నికవి, ప్రముఖ సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ రచనలు సమసమాజ స్థాపనకు బంగారు బాటలని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద రావు అన్నారు. మాదిగ జనసేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన మోదుకూరి జాన్సన్‌ 89వ జయంతి సభలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.

మోదుకూరి రచనలు సమసమాజానికి బాటలు
మోదుకూరి జాన్సన్‌కు నివాళులర్పిస్తున్న అతిథులు

ఒంగోలు(కల్చరల్‌), ఆగస్టు 8:అగ్నికవి, ప్రముఖ సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ రచనలు సమసమాజ స్థాపనకు బంగారు బాటలని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద రావు అన్నారు. మాదిగ జనసేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన మోదుకూరి జాన్సన్‌ 89వ జయంతి సభలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ముందుగా సభకు విచ్చేసిన అతిఽథులు, సేవాసమితి కార్యవర్గ సభ్యులు జాన్సన్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమితి జిల్లా అధ్యక్షుడు గంగవరపు విజయభాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సభలో డొక్కా మాట్లాడుతూ మోదుకూరి జాన్సన్‌ సినిమాలలో రచించిన గీతాలు సంఖ్యాపరంగా తక్కువే అయినప్పటికీ ఆయన ప్రతి అక్షరంలోనూ సమాజాన్ని మేలుకొలిపే దృక్పథం కనిపిస్తున్నదన్నారు. ఏపీ మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ మోదుకూరి జాన్సన్‌ తన రచనల ద్వారా అగ్నికవిగా పేరొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో కవులు బీరం సుందర రావు, పాటిబండ్ల ఆనందరావు, డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌, కత్తి కళ్యాణ్‌, తేళ్ల అరుణ, చాపల బాలకోటయ్య, అట్లూరి అమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రరసం అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మోదుకూరి జాన్సన్‌ జీవితం, సాహిత్యంపై పరిశోధన చేసిన గుంటూరుకు చెందిన రచయిత్రి డాక్టర్‌ మూకిరి సుధను ఈ సందర్భంగా జాన్సన్‌ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గాయనీగాయకులు కొమ్ము విజయ్‌, పూర్ణిమ, మనోహర్‌, డాక్టర్‌ మున్నంగి రాహేలు ఆలపించిన పలు మోదుకూరి జాన్సన్‌ సినీగీతాలు సభికులను విశేషంగా అలరించాయి. 


Updated Date - 2022-08-09T06:00:34+05:30 IST