TOP sports starsపై గృహహింస కేసులు...భార్యలు, మాజీ ప్రియురాళ్ల ఫిర్యాదుల పర్వం

ABN , First Publish Date - 2022-07-06T16:45:34+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ స్పోర్ట్స్ స్టార్లు గృహ హింస కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు....

TOP sports starsపై గృహహింస కేసులు...భార్యలు, మాజీ ప్రియురాళ్ల ఫిర్యాదుల పర్వం

మహ్మద్ షమీ టు నిక్ కిర్గియోస్ దాకా...క్రీడల్లో పేరొందినా వ్యక్తిగత ఆరోపణలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ స్పోర్ట్స్ స్టార్లు గృహ హింస కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్రీడల్లో తమ ప్రతిభా పాటవాలను చూపించి పేరొందిన క్రీడా ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లో వారి భార్యలు, ప్రేయసిలు గృహ హింస ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. భార్య, ప్రేయసిలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పోర్ట్స్ స్టార్ల జాబితాలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, వింబుల్డన్ క్వార్టర్‌ఫైనలిస్ట్ నిక్ కిర్గియోస్, వేల్స్ మాజీ ఫుట్‌బాల్ కోచ్ ర్యాన్ గిగ్స్,ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్‌, ప్రముఖ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్‌లు ఉన్నారు.


మహ్మద్ షమీపై మాజీ భార్య హసిన్ జహాన్ గృహహింస కేసు  

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై అతని మాజీ భార్య హసిన్ జహాన్ గృహహింస ఆరోపణలు చేసింది.షమీపై హసిన్ జహాన్ పెట్టిన కేసుతో 2018వ సంవత్సరంలో బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితా నుంచి షమీని తాత్కాలికంగా తొలగించారు.ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది. 




1. వింబుల్డన్ క్వార్టర్‌ఫైనలిస్ట్ నిక్ కిర్గియోస్ పై మాజీభార్య చియారా పసారి ఫిర్యాదు

వింబుల్డన్ 2022 క్వార్టర్‌ఫైనలిస్ట్ నిక్ కిర్గియోస్ గత ఏడాది జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో వచ్చే నెలలో కాన్‌బెర్రా కోర్టు ముందు హాజరు కానున్నట్లు స్థానిక పోలీసులు బుధవారం తెలిపారు. కిర్గియోస్ మాజీ భాగస్వామి చియారా పసారి చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ అభియోగం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.




2.మైఖేల్ స్లేటర్‌ పై మాజీభార్య మెలానీ లైవ్సే ఫిర్యాదు

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్‌ను గృహహింస కేసులో అక్టోబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.మైఖేల్ స్లేటర్‌పై మాజీభార్య మెలానీ లైవ్సే గృహ హింస ఆరోపణతో కేసు పెట్టింది.దీంతో మైఖెల్ తన మాజీ భార్యను బెదిరించారు.




3.ర్యాన్ గిగ్స్ పై మాజీ ప్రేయసి కేట్ గ్రెవిల్లే కేసు

 మాజీ ఫుట్‌బాల్ మేనేజర్ ర్యాన్ గిగ్స్ తన మాజీ ప్రేయసి కేట్ గ్రెవిల్లే, ఆమె సోదరిపై దాడి చేయడం సంచలనం రేపింది. మాజీ ప్రియురాలు కేట్ పై ర్యాన్ గిగ్స్ బలవంతం చేయడం వంటి నేరారోపణలో కోర్టు కేసులో చిక్కుకున్నారు.




4. బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ పై జోసీ హారిస్ కేసు

బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ 2002లో గృహ హింసకు సంబంధించి కేసు నమోదైంది.బాక్సర్ ఫ్లాయిడ్ దుష్ప్రవర్తనపై పోలీసులు అభియోగాలు మోపారు. 2009వ సంవత్సరంలో మేవెదర్ తన మాజీ స్నేహితురాలు జోసీ హారిస్ నుంచి గృహ హింస ఆరోపణలు ఎదుర్కొన్నారు.


Updated Date - 2022-07-06T16:45:34+05:30 IST