ప్రస్తుతం కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడు: మహ్మద్ యూసఫ్

ABN , First Publish Date - 2021-05-15T15:30:42+05:30 IST

ప్రస్తుత తరంలో కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడని, అతడే నెంబర్ వన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడు: మహ్మద్ యూసఫ్

ప్రస్తుత తరంలో కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడని, అతడే నెంబర్ వన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెటర్లందరూ ఫిట్‌నెస్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కోహ్లీ అద్భుత ప్రదర్శనలకు ఫిట్‌నెస్ కూడా ఓ కారణమని అన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చిన యూసఫ్.. కోహ్లీ గురించి మాట్లాడాడు. 


`ఈ తరంలో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అంటే కోహ్లీనే. కోహ్లీకి వన్డేల్లో, టెస్ట్‌ల్లో కలిపి మొత్తం 70 సెంచరీలున్నాయి. వన్డేల్లో 12 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 10 వేల పరుగులకు చేరువయ్యాడు. టీ-20లోనూ మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. కోహ్లీ ప్రదర్శనలు నమ్మశక్యం కానివి. అయితే పాత తరం క్రికెటర్లతో ఇప్పటి ఆటగాళ్లను పోల్చలేమ`ని యూసఫ్ అన్నాడు. 

Updated Date - 2021-05-15T15:30:42+05:30 IST