మద్దతు కోసమా.. లేక మాములుగా కలిశారా?

Jun 21 2021 @ 18:35PM

త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌ల్లో మంచు విష్ణు పోటీ చేయబోతున్నట్లుగా సోమవారం ఉదయం వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడిదే న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. దీనికి ఊతం ఇచ్చేలా.. కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబుతో కలిసి మంచు విష్ణు.. సూపర్‌ స్టార్‌ కృష్ణని కలిసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పిక్‌ బయటికి వచ్చినప్పటి నుంచి.. మంచు విష్ణు పోటీ చేయడం పక్కా అనేలా వార్తలు వినవస్తున్నాయి. అయితే మోహన్‌ బాబు, మంచు విష్ణు.. సూపర్‌ స్టార్‌ని మద్దతు కోసం కలిశారా? లేక మాములుగా కలిశారా? అనే దానిపై స్పష్టత రాలేదు. మరో వైపు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈసారి జరగబోయే 'మా' ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి :

‘మా’ ఎన్నిక‌ల బ‌రిలోకి మంచు విష్ణు!‘మా’ అధ్యక్ష బరిలో విలక్షణ నటుడు!

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.