తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు

Published: Wed, 29 Jun 2022 03:31:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు

ఆయన కుమారులు కూడా.. 2019 నాటి రాస్తారోకో కేసులో హాజరు

తిరుపతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత  మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 మార్చి 22న చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలో ఈ ముగ్గురు, విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్‌వో సతీశ్‌ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల  కోసం రాస్తారోకో చేపట్టారు. దీంతో కళాశాల ఎదుట తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయని, ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ఎంపీడీవో హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు దిగ్బంధం, వాహనాల రాకపోకలను అడ్డుకోవడం, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడం తదితర అభియోగాలపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో విచారణకు మంగళవారం తిరుపతి 4వ ఏడీఎం కోర్టులో వీరంతా హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేసింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.