Moka Anand Sagar: apని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చాడు

ABN , First Publish Date - 2022-05-03T22:41:38+05:30 IST

CM Jaganreddy అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తాననిచెప్పి, apని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని టీడీపీ అధికారప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ అన్నారు.

Moka Anand Sagar: apని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చాడు

అమరావతి: CM Jaganreddy అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తాననిచెప్పి, apని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని టీడీపీ అధికారప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యపాన నిషేధమని తెలుగు మహిళల్ని జగన్‌రెడ్డి వంచించి,  తన దోపిడీ కోసం వారి మాన ప్రాణాలను బలితీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిమద్యం, నాటుసారా, మాదకద్రవ్యాలను తన పార్టీ వారితో అమ్మిస్తూ, ఏటా రూ.6వేలకోట్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణల డిస్టీలరీల మద్యమే రాష్ట్రంలో చెలామణీ అవుతోందన్నారు. 


ఎంపీ అవినాశ్‌రెడ్డికి మద్యం సరఫరా కాంట్రాక్ట్‌ను జగన్‌రెడ్డి ఇచ్చి, మద్యం దుకాణాల్లో పనిచేసే వారికి రెడ్డి కార్పొరేషన్ ద్వారా జీతాలిస్తున్నారని చెప్పారు.  తన పదవీ కాంక్షను విస్తరింప చేసుకోవడానికి మద్యాన్నే పెట్టుబడిగా పెట్టాలని జగన్‌రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం మద్యం అమ్మకాలపై వచ్చే డబ్బుతోనే ఓట్లు కొనాలని చూస్తున్నారన్నారు. మద్యం, మాదకద్రవ్యాల అమ్మకాలతో మహిళల ఉసురు పోసుకుంటున్న జగన్, వారి కన్నీళ్లకు బలికాక తప్పదని హెచ్చరించారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా తనదోపిడీ మద్యం పాలసీకి స్వస్తి చెప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో పెట్టి, ఆడబిడ్డలను కాపాడాలని Moka Anand Sagar డిమాండ్ చేశారు.

Read more