పతనమవుతున్న మొక్కజొన్న

Published: Tue, 17 May 2022 00:41:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పతనమవుతున్న మొక్కజొన్నవల్లూరుపాలెంలో మొక్కజొన్నను ఆరబెడుతున్న రైతులు

క్వింటా రూ.2,400 నుంచి రూ.1,850కి డౌన్‌


తోట్లవల్లూరు, మే 16 : మొక్కజొన్న ధర రోజురోజుకూ పతనమవుతోంది. క్వింటా మొక్కజొన్న రూ.2,400తో  మొదలై నేడు రూ.1,850, 1,900 పలుకుతోంది. తోట్లవల్లూరు మండలంలో ఈ ఏడాది 3,670 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. తక్కువ కాల వ్యవధిలో పంట చేతికి వచ్చే మొక్కజొన్న సాగును వేలాదిమంది రైతులు చేపట్టారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా తోట్లవల్లూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఈ ఏడాది ప్రైవేట్‌ వ్యాపారులకే అవకాశం కల్పించారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులు ప్రారంభంలో  రికార్డుస్థాయిలో క్వింటాకు రూ.2,400 ధర చెల్లించారు. ఈ ధర లాభ సాటిగా ఉందని రైతులూ సంతోషించారు. తర్వాత ధరను రూ.1,850 వరకు తగ్గించుకుంటూ వచ్చారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.