నడిరోడ్డు మీద వెంటపడి మరీ చెప్పుతో కొట్టిన మహిళ.. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-09T17:57:12+05:30 IST

అతను ఆ కాలనీలో గూండా.. రోజూ మద్యం సేవించి మహిళలను ఏడిపిస్తుంటాడు.. అందరూ అతడికి భయపడి తప్పించుకుని వెళ్లిపోతుంటారు.

నడిరోడ్డు మీద వెంటపడి మరీ చెప్పుతో కొట్టిన మహిళ.. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే..

అతను ఆ కాలనీలో గూండా.. రోజూ మద్యం సేవించి మహిళలను ఏడిపిస్తుంటాడు.. అందరూ అతడికి భయపడి తప్పించుకుని వెళ్లిపోతుంటారు.. అయితే మహిళా దినోత్సవం ముందు రోజున ఓ మహిళ అతనికి తగిన బుద్ధి చెప్పింది.. రోడ్డు మీద చెప్పుతో కొట్టింది.. అతను పారిపోతున్నా వదలకుండా వెంటపడి మరీ కొట్టింది.. చివరకు చుట్టుపక్కల వాళ్లు విడిపించడంతో శాంతించింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌లోని శ్రీరామ్ నగర్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి రోజూ మద్యం సేవించి ఆ కాలనీలో గొడవలకు దిగేవాడు. ఆ కాలనీలో రోడ్ల మీద తిరిగే మహిళలను టీజ్ చేసేవాడు. అసభ్యకరంగా మాట్లాడేవాడు. సోమవారం సాయంత్రం ఆ కాలనీలో నివసించే ఓ మహిళ ఇంటి నుంచి బయటకు రాగా ఆమెపై వెకిలిగా కామెంట్లు చేశాడు. అంతకుముందు కూడా ఆమెపై అతను అలాంటి కామెంట్లు చేశాడు. అయితే ఎప్పటిలాగా ఆమె ఈసారి ఊరుకోలేదు. 


ధైర్యంగా అతడిపై దాడికి దిగింది. అందరూ చూస్తుండగా చెప్పు తీసి అతడిని కొట్టింది. షాకైన దినేష్ అక్కణ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అంత సులభంగా వదల్లేదు. వెంటాడి మరీ అతడిని చితక్కొట్టింది. కొంతసేపటి తర్వాత స్థానికులు వచ్చి విడిపించడంతో దినేష్ అక్కణ్నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

Updated Date - 2022-03-09T17:57:12+05:30 IST