CMతో చర్చించాకే పాలధర పెంపుపై నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-17T17:23:52+05:30 IST

నందిని పాలధర పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఫ్‌) అధ్యక్షుడు బాలచంద్ర జార్కిహొళి వెల్లడించారు. నగరంలో కేఎంఎఫ్‌ 2020-21 వార్షిక సర్వసభ్య

CMతో చర్చించాకే పాలధర పెంపుపై నిర్ణయం

                     - కేఎంఎఫ్‌ అధ్యక్షుడు బాలచంద్ర జార్కిహొళి


బెంగళూరు: నందిని పాలధర పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఫ్‌) అధ్యక్షుడు బాలచంద్ర జార్కిహొళి వెల్లడించారు. నగరంలో కేఎంఎఫ్‌ 2020-21 వార్షిక సర్వసభ్య సమావేశంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ నిర్వహణా ఖర్చులు బాగా అధికం కావడంతో పాలధరను లీటరకు రూ.3 చొప్పున పెంచాలని దాదాపు అన్ని జిల్లాల పాలసమాఖ్య అధ్యక్షులు ప్రతిపాదించారన్నారు. ప్రస్తుతం నందిని పాల ధర లీటరు రూ. 37గా ఉందని మూడు రూపాయలు అదనంగా పెంచితే ఇది రూ.40 కానుందన్నారు. అయినా ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువేనన్నారు. కొవిడ్‌ వేళ ప్రజలపై భారం వద్దని పలువురు కోరుతున్నారని, ధరల పెంపు విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 జిల్లా పాల సమాఖ్యలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుత ఏడాది కేఎంఎఫ్‌కు చెందిన 5 పశువుల ఆహార తయారీ విభాగాల ద్వారా 7.28 లక్షల టన్నుల పశు ఆహారం ఉత్పాదన చేసి వీటి అమ్మకాల ద్వారా రూ. 1,017 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-01-17T17:23:52+05:30 IST