ఊపందుకున్న ఉపాధి

ABN , First Publish Date - 2021-04-24T04:20:02+05:30 IST

వ్యవసా య పనులు పూర్తికావడంతో ఇక చేతిలో పనిలే దనుకున్న కూలీలకు ఉపాధి హామీ పనులు కాస్త ఆశలు చిగురింపజేశాయి.

ఊపందుకున్న ఉపాధి
మైలవరంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న ఎంపీడీవో రామచంద్రారెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 24:  వ్యవసా య పనులు పూర్తికావడంతో ఇక చేతిలో పనిలే దనుకున్న కూలీలకు ఉపాధి హామీ పనులు కాస్త ఆశలు చిగురింపజేశాయి. వేసవి ఎండలు మండుతుండడంతో కూలీలకు ఉపాధి పథకం చేదోడుగా నిలుస్తోంది. ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నిబంధన లు పాటిస్తూ ఉపాధి పనులు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మలమడుగు మండలంలోని సలివెందుల గ్రామంలో మహా త్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నాలుగు చోట్ల   చేపట్టినట్లు  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఓబులేసు తెలిపారు. ప్రతి ఒక్క కూలి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన ర గంటల వరకు పనులు చేయాల్సి ఉందన్నారు. ఒక్కొక్క కూలీ 1.20 మీటర్లు పని మట్టి తవ్వకం చేయాలన్నారు. ఒక్కొక్కరికి రూ.227 కూలి పడుతుందన్నారు. 


జాబ్‌ కార్డు కలిగిన 



వారందరికీ పనులు

మైలవరం, ఏప్రిల్‌ 23 : గ్రామాల్లో జాబ్‌కార్ఢు కలిగిన ప్రతి ఒక్కరూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులకు వెళ్లవ చ్చని ఎంపీడీవో రామచంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కరమలవారిపల్లి, పెద్దకొమెర్ల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో తనిఖీ చేశారు.  జరుగు తున్న పనులపై కూలీలతో మాట్లాడారు. గ్రామం లో ఎంత మంది పనులకు వస్తున్నారని, గ్రామంలో పనులకు వచ్చే వారు ఎవరైనా ఉంటే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదే శించారు. ఉపాధి కూలీలకు రూ.245 కూలి పడుతుందన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభి స్తున్నందున ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల న్నారు. కార్యక్రమంలో ఉపాధి ఏపీవో లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:20:02+05:30 IST