టెన్త్‌ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభంకానున్నాయి.

టెన్త్‌ విద్యార్థులకు  రెండు పూటలా తరగతులు
విద్యార్థులు (ఫైల్‌)

 రేపటి నుంచి అమలు

103 రోజుల ప్రణాళిక 

అదే రోజు నుంచి ఇంటర్‌ 

ఫస్టియర్‌ క్లాసులూ ప్రారంభం 

వేసవి సెలవులు రద్దు


ఒంగోలు విద్య, జనవరి 16 : పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు  జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు. 


రేపటి నుంచి ఆరో తరగతి క్లాసులు 

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి  క్లాసులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు. 


ఇంటర్‌కు 106 పనిదినాలు 

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు  సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 


Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST