డాటా ఎంట్రీ ఆధారంగా రైతు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

ABN , First Publish Date - 2021-05-09T06:17:51+05:30 IST

మద్దూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సవ్యంగా నడుస్తున్నాయని, డాటా ఎంట్రీ ఆధారంగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

డాటా ఎంట్రీ ఆధారంగా రైతు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు
మద్దూరు కొనుగోలు కేంద్రంలో సమస్యలను తెలుసుకుంటున్న హుస్నాబాద్‌ ఆర్డీవో

హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి

మద్దూరు, మే 8 : మద్దూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సవ్యంగా నడుస్తున్నాయని, డాటా ఎంట్రీ ఆధారంగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రమైన మద్దూరుతో పాటు గాగిళ్లాపూర్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా  కొనుగోలు విఽధానంలో ఇబ్బందుల గూర్చి రైతులను అడిగి తెలుసుకున్నారు. డాటా ఎంట్రీలో కొన్ని సమస్యలున్నాయి. డాటా ఎంట్రీ ఆధారంగా రైతుల ఖాతాలకు డబ్బులు పడుతున్నాయన్నారు. హుస్నాబాద్‌ డివిజన్‌లో ఇప్పటి వరకు 3 లక్షల 67 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, లక్షా 37 వేల క్వింటాళ్ల ధాన్యానికి డబ్బు  చెల్లింపు జరిగిందన్నారు. మరో 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు.  లద్నూరులో కొనుగోలు చేసిన ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని మిల్లర్లు సెకండ్‌ గ్రేడ్‌ కింద పరిగణిస్తూ రూ. 20 తక్కువ వచ్చేలా చేస్తున్నారని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు.  పొడవు గింజలకు గ్రేడ్‌ తక్కువ చేస్తున్నట్లు చెబితే తప్పకుండా చర్యలు తీసుకుని న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ నరేందర్‌, ఆర్‌ఐ అయిలయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు. 


కొనుగోలు కేంద్రం పరిశీలన

గజ్వేల్‌, మే 8: గజ్వేల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏఎంసీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. తేమశాతం 17లోపు ఉండేలా చూసుకోవాలని, పొళ్లు, తాలు లేకుండా చూడాలన్నారు. గజ్వేల్‌ మండలంలో 12, జగదేవ్‌పూర్‌ మండలంలో 11 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2021-05-09T06:17:51+05:30 IST