కాసులూ పోయె.. కోసలూ పోయె..

ABN , First Publish Date - 2022-01-18T05:03:13+05:30 IST

సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఈ సంద ర్భంగా సంప్రదాయ కోడిపందేల ముసుగులో గుండాట, పేకాట, సారా, మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే నిర్వాహకులకు కొత్త చిక్కు వచ్చి పడింది.

కాసులూ పోయె.. కోసలూ పోయె..

  • అప్పులు మిగిలె.. లబోదిబో అంటున్న పందేల నిర్వాహకులు

కోరుకొండ, జనవరి 17: సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఈ సంద ర్భంగా సంప్రదాయ కోడిపందేల ముసుగులో గుండాట, పేకాట, సారా, మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే నిర్వాహకులకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోడిపందేల సందర్భంగా గ్రామాల్లో తలెత్తిన తగాదాలు, కక్షలు కార్పణ్యాలు, పందేల కోసం చేసిన అప్పులు మిగిలాయి. గొప్పల కోసం పందేల నిర్వాహకులు ఇన్ని కోసలు ఇస్తాం. ఇన్ని కేసులు ఇస్తాం. చివరగా కొన్ని కాసులు ఇస్తాం అంటూ పందేలకు ముందు పోలీసులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారన్నది బహిరంగ రహస్యం. దీని ప్రకారం పందాలు జరుగు తున్న మూడు రోజులు ప్రతి రోజు సాయంత్రం పందేల నిర్వాహకులు పోలీ సులు చెప్పిన విధంగా కేసులు, కోసలు అప్పగించాలి. పందేలు ముగిశాక చివరిగా కాసులు ముట్టచెప్పుతారనేది జగమేరిగిన సత్యం. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు పందేలకు  ముందున్న ఉత్సాహం ఇప్పుడు కానరావడంలేదు. ఎక్కడ చూసినా అప్పులు కనిపిస్తున్నాయంటూ లబోదిబో అంటున్నారు. మరికొందరు తెలివైన పందేల నిర్వాహకులు గుండాటలకు వేలం నిర్వహించి లక్షల్లో డబ్బులు లాగేశారు. నిర్వహణ ఖర్చులు భారీగా చూపించి వసూళ్లకు తగ్గ లెక్కలు చూపించడం లేదంటూ గ్రామాల్లో వర్గాల మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. పందేల సందర్భంగా ఇరువర్గాల మధ్య తలెత్తిన కొట్లాటలు, తగాదాలు తీర్చలేక మండల, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతి పందేలు సందర్భంగా అన్నివర్గాల వారు నష్ట పోగా ఓ వర్గం వారు మాత్రం చక్కగా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుం టూ కాలు కదపకుండా కోసలు తింటూ కాసులు వెనకేసుకుంటూ హాయిగా ఉన్నారంటూ ప్రజానీకం వచ్చిన ప్రధాన ఆరోపణ.

Updated Date - 2022-01-18T05:03:13+05:30 IST