కొత్త వెంచర్లపై పర్యవేక్షణ కరువు

ABN , First Publish Date - 2021-07-27T06:27:48+05:30 IST

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఔట్లపైన అధికారులు దృష్టిసారించకపోవడంతో వెంచర్‌ యజమానులకు కలిసివస్తోంది. పట్టా భూములకు అనుమతులు తీసుకుని అసై న్డ్‌ భూములను కలుపుతూ ప్లా ట్లను చేస్తున్నారు.

కొత్త వెంచర్లపై పర్యవేక్షణ కరువు
జిల్లాలో లేఔట్‌లు లేని పలు వెంచర్లు

జిల్లాలో కొత్త వెంచర్లపె అధికారుల ఉదాసీన వైఖరి
పట్టా భూముల్లో అనుమతుల కోసం దరఖాస్తు
అసైన్డ్‌ భూములను కలిపి ప్లాట్లు చేసి అమ్మకాలు
ఇళ్ల నిర్మాణ సమయంలో కొనుగోలుదారుల ఇబ్బందులు

నిజామాబాద్‌, జూలైౖ 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఔట్లపైన అధికారులు దృష్టిసారించకపోవడంతో వెంచర్‌ యజమానులకు కలిసివస్తోంది. పట్టా భూములకు అనుమతులు తీసుకుని అసై న్డ్‌ భూములను కలుపుతూ ప్లా ట్లను చేస్తున్నారు. జిల్లాలో పలుచో ట్ల అమ్మకాలు చేస్తున్నారు. అనుమతుల పేరుతో కొనుగోలు చేసినవారు ఇళ్లను నిర్మించుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్‌, పంచాయతీ, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో వందల సంఖ్యలో వెంచర్లు
జిల్లాలో వందలాదిగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలుస్తున్నాయి. నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల పరిధిలో  కొత్త వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. భూములు కొనుగోలు చేసినపుడు పట్టాభూములను కొంటున్నారు. వాటితో పాటు అసైన్డ్‌ భూములను కొనుగోలుచేస్తున్నారు. వ్యవసాయ భూ ములను నాలా కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందుతున్నారు. వెంచర్లుగా మార్చే సమయంలో పట్టా భూములకు మాత్రమే అనుమతులను తీసుకుంటున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ కంట్రీ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులకు దరఖాస్తులు చేసే స మయంలో పట్టా భూముల వివరాలు పం పిస్తున్నారు. ఆ అనుమతులు చూపిస్తూ వాటితో పాటు కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూములను కూడా ప్లాట్లుగా మారుస్తూ అమ్మకాలు చేస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అనుమతి ఇచ్చిందని కొనుగోలుదారులకు చూపెడుతూ భారీరేట్లకు అమ్ముతున్నారు. వీటిని కొనుగోలు చేసినవారు కొన్నాళ్ల తర్వాత ఇళ్లు నిర్మించుకోడానికి దరఖాస్తు చేస్తే అప్పుడు అనుమతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ భూములు అసైన్డ్‌ కింద ఉండడం వల్ల అనుమతులు రావడంలేదు. కొన్ని నిబంధనల ప్రకారం భారీ మొత్తంలో డబ్బులను చెల్లించి అనుమతులు తెచ్చుకుంటున్నారు. కొంతమంది ముందే ఇళ్లు నిర్మించుకుని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రె గ్యులరైజ్‌ చేసుకుంటున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ కంట్రీ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు లే ఔట్‌ చేసిన తర్వాత అనుమతులు ఇచ్చినా భూములని పరిశీలిస్తే కొనుగోలుదారులకు ఇబ్బందులు వచ్చేవికావు. ఇలాంటి ఎక్కువగా నిజామాబాద్‌ నగరం పరిధిలో జరుగుతున్నాయి. ఆర్మూర్‌ మున్సిపాలిటీ చుట్టుపక్కల ఎక్కువ మొత్తంలో వెంచర్‌లు ఉన్నాయి. బోధన్‌ పరిధిలో కూడా కొన్ని వెంచర్‌ లో ఇదేవిధంగా కొనసాగుతున్నాయి. జాతీయ రహదాకి ఆనుకుని ఉన్న మండలాల పరిధిలో కూడా ఇదేవిధంగా ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ముందే అధికారులు తనిఖీలు చేసి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం ఉం డదు. ఈ రియల్‌ వెంచర్‌లో బిల్డర్‌లతో పాటు ఎక్కువమంది ప్రజాప్రతినిధులు, నే తలు ఉండడం వల్ల అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నారు. జిల్లా కంట్రీ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం తమ పరిధిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. తమకు సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల అన్ని ప్రాంతాలకు వెళ్లడం లేదన్నారు. అన్నీ చూసిన తర్వాతనే వెంచర్‌లకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. కొనుగోలు చేసేవారు కూడా అన్ని సరిచూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలని వారు సూచించారు.

Updated Date - 2021-07-27T06:27:48+05:30 IST