West Godavari: కోతి శరీరంలో బుల్లెట్.. షాకైన వైద్యులు

ABN , First Publish Date - 2022-07-20T22:47:20+05:30 IST

కోతి (Monkey) శరీరంలో బుల్లెట్ వెలుగు చూడటం తూర్పుగోదావరి జిల్లా చెరుకువాడలో కలకలం...

West Godavari: కోతి శరీరంలో బుల్లెట్.. షాకైన వైద్యులు

తూర్పుగోదావరి (West Godavari): కోతి (Monkey) శరీరంలో బుల్లెట్ వెలుగు చూడటం తూర్పుగోదావరి జిల్లా చెరుకువాడలో కలకలం రేపింది. కుక్క(Dogs)ల దాడిలో గాయపడిన కోతిని స్థానికులు పెట్ కేర్‌ (Pet Care)కు తరలించారు. కోతికి చికిత్స చేస్తుండగా బుల్లెట్ (Bullet) వెలుగు చూసింది. దీంతో నాటు తుపాకీ (Gun)తో కోతిని కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఎవరి పని అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 


ఇక కోతికి గాయమై నాలుగు రోజులు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గాయం వల్ల కోతి చెట్టు నుంచి కింద పడిందని.. ఆ సమయంలోనే కుక్కలు దాడి చేశాయని తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం కోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రస్తుతం అది నడవలేని స్థితిలో ఉందని చెప్పారు. త్వరగానే కోలుకుంటుందని.. కోతికి ఎక్స్ రే చేస్తే మరిన్ని గాయాలు తెలిసే అవకాశం ఉందని వైద్యులు అన్నారు. ఎలాంటి గాయాలు లేకపోతే కోతిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. 



Updated Date - 2022-07-20T22:47:20+05:30 IST