థాయ్‌లాండ్‌లో కోతుల పండుగ

ABN , First Publish Date - 2021-12-05T12:50:55+05:30 IST

కోతుల పండుగ.. ఈ పేరు వింటేనే అందరికీ ఆశ్చర్యమేస్తుంది. ఈ పండుగ జరిగే ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులే.. ఆ వానరాలను చూడడానికే అక్కడ భారీగా పర్యాటకులు వస్తారు. వాటికోసం ఎన్నో రకాల పండ్లను తీసుకువస్తారు. ఇంతకీ ఈ మంకీ ఫెస్టివల్ జరిగేది ఎక్కడంటారా?...

థాయ్‌లాండ్‌లో కోతుల పండుగ

కోతుల పండుగ.. ఈ పేరు వింటేనే అందరికీ ఆశ్చర్యమేస్తుంది. ఈ పండుగ జరిగే ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులే.. ఆ వానరాలను చూడడానికే అక్కడ భారీగా పర్యాటకులు వస్తారు. వాటికోసం ఎన్నో రకాల పండ్లను తీసుకువస్తారు. ఇంతకీ ఈ మంకీ ఫెస్టివల్ జరిగేది ఎక్కడంటారా? ఆసియా దేశమైన థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతంలో . ఈ పండుగ కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈ మంకీ ఫెస్టీవల్ మళ్లీ ప్రారంభమైంది. 


ఈ వానర పండుగలో వేలాది కోతులు ఒక చోట చేరుకొని వాటికి కావాల్సిన అన్ని ఆహార ప‌దార్థాల‌ను హాయిగా ఆరగిస్తాయి. ఇటీవల జరిగిన ఈ పండుగలో వేలాది కోతులను చూడడానికి వేలాది మంది పర్యాటకులు అక్కడికి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. మంకీ ఫెస్టివల్ కోసం చాలా రకాల పండ్లను, పలు ఆహార పదార్థాలను నిర్వహకులు సమకూర్చారు. ఈ ఫెస్టివల్‌లో పర్యాటకులు, స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంకీ ఫెస్టివల్ కోసం రెండు టన్నుల పండ్లు, కూరగాయలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పండుగకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. 




ఆ వీడియోలలో కోతులు పలువురు వ్యక్తులపై కూర్చొని హాయిగా పండ్లను తింటున్నాయి. అందుకే లోప్‌బురిని “మంకీ ప్రావిన్స్” అని పిలుస్తారు. కరోనా నేపథ్యంలో.. రెండు కరోనా టీకాలు తీసుకున్న పర్యాటకులను మాత్రమే ఈ పండుగలో పాల్గనడానికి అనుమతిస్తున్నారు. ఈ ఫెస్టివ‌ల్ ప్రతి ఏడాది న‌వంబ‌ర్ చివ‌రి వారంలో నిర్వహిస్తారు. 


ఈ ఫెస్టివ‌ల్ ప్రతి ఏడాది న‌వంబ‌ర్ చివ‌రి వారంలో నిర్వహిస్తారు. కానీ.. గ‌త రెండేళ్ల నుంచి క‌రోనా వ‌ల్ల ఆ ఫెస్టివ‌ల్ నిర్వహించడం లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత కోతులు ఇష్టంగా ఆహారాన్ని తింటున్నాయంటూ నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో ఈ ఫెస్టివ‌ల్‌ను నిర్వహిస్తారు. ఈసారి వీల్‌చైర్ మంకీస్ అనే థీమ్‌తో వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుక ద్వారా వికలాంగుల సహాయార్థం 100 వీల్‌చైర్లను ఉచితంగా పంపిణా చేసామని  నిర్వహకలు చెప్పారు.


Updated Date - 2021-12-05T12:50:55+05:30 IST