మంకీ ఫీవర్‌ ఛాయలు లేవు: మంత్రి సుబ్రమణ్యం

ABN , First Publish Date - 2022-05-27T14:52:59+05:30 IST

రాష్ట్రంలో మంకీ ఫీవర్‌ వ్యాప్తి లేదని, ప్రజలు దీనిపై ఆందోళన చెందవద్దని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం స్పష్టం చేశారు.సైదాపేట తిరువళ్లువర్‌ వీధిలో కొత్తగా

మంకీ ఫీవర్‌ ఛాయలు లేవు: మంత్రి సుబ్రమణ్యం

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో మంకీ ఫీవర్‌ వ్యాప్తి లేదని, ప్రజలు దీనిపై ఆందోళన చెందవద్దని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం స్పష్టం చేశారు.సైదాపేట తిరువళ్లువర్‌ వీధిలో కొత్తగా నిర్మించనున్న డ్రైనేజీ పనులను గురువారం మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్ల విస్తరణ నిమిత్తం తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చని కారణం వల్లే గత ఏడాది వర్షాకాలంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరిందని, రానున్న రోజుల్లో ఇది పునరావృతం కాకుండా కాలువల్లో పూడికతీత, కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల వల్ల మంకీ ఫీవర్‌ వ్యాపించకుండా అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, రాష్ట్రంలో దాని ఛాయలు ఇప్పటివరకు లేవని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-27T14:52:59+05:30 IST