Funny Video: ఆ వ్యక్తి హెయిర్ స్టైల్ చూసి కళ్లు తిరిగి పడిపోయిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-08-27T23:07:15+05:30 IST

ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్న తెలివైన జంతువుల జాబితాలో కోతులను (monkey gets shock) కూడా చేర్చవచ్చు.

Funny Video: ఆ వ్యక్తి హెయిర్ స్టైల్ చూసి కళ్లు తిరిగి పడిపోయిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్న తెలివైన జంతువుల జాబితాలో కోతులను (monkey gets shock) కూడా చేర్చవచ్చు. అసలు కోతి నుంచే మనిషి వచ్చాడంటారు. కోతుల ప్రవర్తన, వాటి హావభావాలు చాలా వరకు మనుషులను పోలి ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ కోతికి సంబంధించిన వీడియో బాగా వైరల్ (Viral Video)అవుతోంది. ఓ వ్యక్తి విచిత్రమైన హెయిర్ స్టైల్ (Crazy Hairstyle) చూసి కోతి షాకై కళ్లు తిరిగి పడిపోయింది.


ఈ వీడియోలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన టోపీని తీసి కిందపడేశాడు. దీంతో అతని హెయిర్ స్టైల్ బయటపడింది. దానిని చూసి కోతి విద్యుత్ షాక్ తగిలినట్లుగా కింద పడిపోయింది. animals.hilarious అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో 10 లక్షల వ్యూస్ సాధించింది. 65 వేల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. 


Updated Date - 2022-08-27T23:07:15+05:30 IST