Viral Video: ఈ కోతి ఆట ఆడే విధానం చూస్తే.. ఇదెక్కడి కోతిరా నాయనా అంటారు..

ABN , First Publish Date - 2022-01-23T01:24:28+05:30 IST

సర్కస్‌లలో వివిధ ఆటలను అచ్చం.. మనుషుల మాదిరే ఆడటం చూస్తూనే ఉంటాం. అయితే ఎలాంటి శిక్షణ లేకుండానే కొన్ని కోతులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

Viral Video: ఈ కోతి ఆట ఆడే విధానం చూస్తే.. ఇదెక్కడి కోతిరా నాయనా అంటారు..

కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే సందర్భాల్లో కోతి చేష్టలు చేయొద్దు.. అంటూ ఉంటాం. కోతులు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టే.. మనుషులు అలాంటి పనులు చేసే సందర్భంలో..  కోతి చేష్టలు అనే పదం వాడడం ఆనవాయితీ అయింది. కొన్ని కోతులు ప్రవర్తించే తీరు విచిత్రంగా ఉంటుంది. ఇంకొన్ని కోతులైతే అచ్చం మనుషుల్లానే చేస్తూ ఉంటాయి. శిక్షణ పొందిన కోతుల గురించి చెప్పనక్కరలేదు. సర్కస్‌లలో వివిధ ఆటలను అచ్చం.. మనుషుల మాదిరే ఆడటం చూస్తూనే ఉంటాం. అయితే ఎలాంటి శిక్షణ లేకుండానే కొన్ని కోతులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఓ అడవిలో చెక్కబోర్డును ఏర్పాటు చేసి, అందులో ఫజిల్‌ తరహాలో గడులను ఏర్పాటు చేశారు. బంతిని పైన వదిలాక.. అది కిందికి వచ్చేలా గడుల్లో అడ్డంకులను తొలగించాల్సి ఉంటుంది. దీన్ని మనుషులు చేయాలంటేనే కనీసం ఒక నిమిషమైనా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఓ కోతి మాత్రం అవలీలగా చేసేసింది. చెక్క బోర్డు వద్ద కొన్ని కోతులు గుమికూడి ఆటను ఆడాలని చూస్తాయి. బోర్డు పైనుంచి బంతిని గడుల్లోకి వేయగానే.. మిగతా కోతులు ప్రయత్నించినా సాధ్యం కాదు. అయితే ఓ కోతి మాత్రం చాలా తెలివిగా చకచకా బంతికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఈ తెలివైన కోతిని తెగ మెచ్చుకుంటున్నారు.

ఈ పాముకు కూడా కొబ్బరి బోండాలు కావాలేమో.. ఎలా ఎక్కుతోందో మీరే చూడండి..



Updated Date - 2022-01-23T01:24:28+05:30 IST