Monkeypox:ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

ABN , First Publish Date - 2022-09-30T12:50:57+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శుక్రవారం మరో మంకీపాక్స్(Monkeypox) కేసు వెలుగుచూసింది....

Monkeypox:ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శుక్రవారం మరో మంకీపాక్స్(Monkeypox) కేసు వెలుగుచూసింది. నైజీరియా దేశానికి చెందిన పౌరుడికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో(Delhi) మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. 30 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ పాజిటివ్ తేలడంతో ఆమెను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు.లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో(Lok Nayak Jai Prakash Hospital) ప్రస్థుతం మంకీపాక్స్ తో ఐదుగురు రోగులు చికిత్స పొందుతున్నారు. మరో నైజీరియన్ మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు.


ఢిల్లీలో వెలుగుచూసిన మంకీపాక్స్ కేసుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా దేశ పౌరులని(African origin) లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 14కు పెరిగింది.(rises) మంకీపాక్స్ వ్యాప్తి తక్కువగానే ఉందని డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. 

Updated Date - 2022-09-30T12:50:57+05:30 IST