మంకీ పాక్స్ కట్టడికి ఇలా చేయండి.. WHO ఐదు సూచనలు

ABN , First Publish Date - 2022-06-06T02:41:03+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు ఐదు సూచనలు చేసింది.

మంకీ పాక్స్ కట్టడికి ఇలా చేయండి.. WHO ఐదు సూచనలు

ఎన్నారై డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు ఐదు సూచనలు చేసింది. వీటి ప్రకారం..  ప్రభుత్వాలు  మొదటగా మంకీపాక్స్‌ను వేగంగా గుర్తించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలి. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి.  ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా  ప్రజారోగ్య విధానాల ద్వారా అడ్డుకోవాలి. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లు వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీవైరల్ మందులను సిద్ధం చేసుకోవాలి. వ్యాధి తీరుతెన్నులపై  పరిశోధనపై మరింతగా దృష్టి పెట్టాలి. 


మంకీపాక్స్ కాలుపెట్టిన దేశాల జాబితా విడుదల..

మంకీపాక్స్ కేసులు వెలుగు చూసిన జాబితా కూడా ప్రపంచఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 708 కేసులు వెలుగు చూశాయి. గ్రేట్ బ్రిటన్‌, ఉత్తర ఐర్లాండ్ దేశాల్లో అత్యధికంగా 207 కేసులు వెలుగు చూశాయి. స్పెయిన్‌లో 156, పోర్చుగల్‌లో 138, కెనడాలో 58, జర్మనీలో 57, ఫ్రాన్స్‌లో మొత్తం 33 మంది ఇప్పటివరకూ మంకీపాక్స్ బారినపడ్డారు. 



Updated Date - 2022-06-06T02:41:03+05:30 IST