heavy rainfall బీభత్సం...దేశంలో 400మందికి పైగా మృతి

ABN , First Publish Date - 2022-07-16T18:42:40+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాకాలం బీభత్సం సృష్టిస్తోంది...

heavy rainfall బీభత్సం...దేశంలో 400మందికి పైగా మృతి

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాకాలం బీభత్సం సృష్టిస్తోంది.దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు( heavy rainfall), వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 400 మందికి పైగా మరణించారు.గుజరాత్‌లో, దక్షిణ గుజరాత్,సౌరాష్ట్రలోని కొన్ని ప్రదేశాలలో శనివారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదికి వెల్లువెత్తిన వరదలతో పలు గ్రామాల ప్రజలు రోజుల తరబడి వరదనీటిలో చిక్కుకుపోయారు. గుజరాత్‌లో భారీవర్షాల వల్ల 80 మంది మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్రలో కూడా 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మహారాష్ట్రలో వరదల వల్ల మృతుల సంఖ్య 102కి చేరింది.ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్, అసోంలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Updated Date - 2022-07-16T18:42:40+05:30 IST