పోలీస్‌ అధికారులకు ప్రతినెలా రివార్డులు

ABN , First Publish Date - 2022-01-26T05:02:40+05:30 IST

పోలీస్‌ అధికారులకు ప్రతినెలా రివార్డులు

పోలీస్‌ అధికారులకు ప్రతినెలా రివార్డులు
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

బంట్వారం, జనవరి 25 : సక్రమంగా విధులు నిర్వహించే పోలీస్‌ అధికారులకు ప్రతి నెలా రివార్డులు ఇస్తామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం బంట్వారం పోలీ్‌సస్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది టర్న్‌ఔట్‌, పోలీ్‌సస్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలని, పోలీ్‌సస్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసిపెట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, ధారూరు సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ ఆనంద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-26T05:02:40+05:30 IST