మూఢనమ్మకాలను ప్రోత్సహించడం సరికాదు

ABN , First Publish Date - 2021-01-25T05:56:57+05:30 IST

ప్రభుత్వాలే మూడనమ్మకాలను ప్రోత్సహించే విధంగా భూత వైద్యంలో కోర్సులను తీసుకురావడం సరికాదని జేవీవీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నాగేశ్వరరావు విమర్శించారు.

మూఢనమ్మకాలను ప్రోత్సహించడం సరికాదు
మాట్లాడుతున్న డాక్టర్‌ నాగేశ్వరరావు


కనిగిరి, జనవరి 24 : ప్రభుత్వాలే మూడనమ్మకాలను ప్రోత్సహించే విధంగా భూత వైద్యంలో కోర్సులను తీసుకురావడం సరికాదని జేవీవీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నాగేశ్వరరావు విమర్శించారు. స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం జేవీవీ ఆధ్వర్యంలో జరిగిన నూతన వ్యవసాయ చట్టాలు, పర్యావసనాలపై స్టడీ సర్కిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల వలన జరిగే అన ర్థాలను వివరించారు. వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జేవీవీ సభ్యులు మూఢనమ్మకాల పట్ల ప్రజలకు ఉన్న అపనమ్మకాలను తొలగించేలా కార్యక్రమాలు నిర్వ హించాలని కోరారు. అదేవిధంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు జేవీవీ సభ్యులంతా రైతులకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో జేవీవీ జిల్లా మాజీ అధ్యక్షుడు  మాలకొండారెడ్డి, నాయకు లు బ్రహ్మారెడ్డి, బ్రహ్మయ్య, రమణయ్య, వెంకటేష్‌, శ్రీనివాసులరెడ్డి, ఖాజా రహంతుల్లా, గిరిజ, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T05:56:57+05:30 IST