పెసరతో పచ్చడి

ABN , First Publish Date - 2022-04-09T16:38:09+05:30 IST

పెసరపప్పు - అరకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, నూనె - సరిపడా

పెసరతో పచ్చడి

కావలసినవి: పెసరపప్పు - అరకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, నూనె - సరిపడా, ఇంగువ - చిటికెడు, చింతపండు - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఆవాలు -  అర టీస్పూన్‌, జీలకర్ర- ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, నెయ్యి - కొద్దిగా. 


తయారీ విధానం: పెసరపప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి.స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి మూడు ఎండుమిర్చి, అర టీస్పూన్‌ జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.నానబెట్టిన పప్పు మిక్సీలో వేసి, వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, నానబెట్టిన చింతపండు, ఇంగువ, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పేస్టులా పట్టుకుంటే చట్నీ రెడీ అవుతుంది. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును చట్నీలో కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి సర్వ్‌ చేసుకుంటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2022-04-09T16:38:09+05:30 IST