మూస్‌

ABN , First Publish Date - 2022-03-12T18:55:35+05:30 IST

హంగ్‌ కర్డ్‌ - రెండు కప్పులు, పంచదార - పావు కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, డార్క్‌ చాక్లెట్‌ - 250గ్రాములు, పుదీనా - ఒకకట్ట, ఫ్రెష్‌ క్రీమ్‌ - 50గ్రా.

మూస్‌

కావలసినవి: హంగ్‌ కర్డ్‌ - రెండు కప్పులు, పంచదార - పావు కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, డార్క్‌ చాక్లెట్‌ - 250గ్రాములు, పుదీనా - ఒకకట్ట, ఫ్రెష్‌ క్రీమ్‌ - 50గ్రా.


తయారీ విధానం: ఒక బౌల్‌లో హంగ్‌ కర్డ్‌ తీసుకుని అందులో పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఒక సాస్‌ పాన్‌లో సగం వరకు నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి.  డార్క్‌ చాక్లెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని మిక్సింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత అందులో క్రీమ్‌ కలపాలి. ఈ బౌల్‌ని సాస్‌ పాన్‌పైన పెట్టాలి. చాక్లెట్‌, క్రీమ్‌ కరిగి స్మూత్‌ మిక్చర్‌ తయారవుతుంది. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకున్న హంగ్‌ కర్డ్‌, వెనీలా మిశ్రమంతో కలుపుకోవాలి. తరువాత సర్వింగ్‌ డిష్‌లలోకి మార్చుకుని ఫ్రిజ్‌లో మూడు నుంచి నాలుగు గంటల పాటు పెట్టుకోవాలి. పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2022-03-12T18:55:35+05:30 IST