కదిలి ఆలయాభివృద్ధికి మరింత కృషి

ABN , First Publish Date - 2022-05-21T06:50:21+05:30 IST

కదిలి పాపహారేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

కదిలి ఆలయాభివృద్ధికి మరింత కృషి
మాదాపూర్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అల్లోల

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల

దిలావర్‌పూర్‌, మే 20 : కదిలి పాపహారేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలయంలో జరిగిన దేవస్థానం చైర్మన్‌ ఎన్‌.భుజంగ్‌రావు పిల్లల పుట్టు పంచెల కార్యక్రమానికి మంత్రి అల్లోల హాజరయ్యారు. ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపడతామని అన్నారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కాటేజీలను నిర్మిస్తామ న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయ న్నారు. మంత్రి వెంట ఎంపీపీ పాల్దే అక్షర అనిల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కే. దేవేందర్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు డా. సుభాష్‌ రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు మురళీధర్‌ రెడ్డి, రాంకిషన్‌ రెడ్డి, చిన్నారెడ్డి, ధని రవి, ఆత్మ డైరెక్టర్‌ సప్పల రవి, సాంబాజీ పటేల్‌, వెంకట్‌ రావు, తదితరులు ఉన్నారు. 

మాదాపూర్‌లో విగ్రహప్రతిష్ఠ

సోన్‌, మే 20 : మండలంలోని మాదాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మిం చిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ విగ్రహప్రతిష్ఠ కార్య క్రమానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. అర్చకులు, మహిళలు మంత్రిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనం తరం సంబంధిత పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుడూ... రూ.10లక్షలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించా మని తెలిపారు. మరో రూ.15 లక్షల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో హనుమాన్‌ ఆలయానికి రూ.30 లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ.30 లక్షలు, సాయిబాబా ఆలయానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాజ్యం నరసింహరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు జీవన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణ ప్రసాద్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-21T06:50:21+05:30 IST