కబడ్డీ క్రీడకు మరింత ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-01-21T05:50:22+05:30 IST

గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చిరపరిచితమైన కబడ్డీ క్రీడకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అవసరమని పాలమూరు విశ్వవిద్యాలయం ఫిజికల్‌ డైరెక్టర్‌ బాలరాజు గౌడ్‌ అన్నారు.

కబడ్డీ క్రీడకు మరింత ప్రోత్సాహం
ప్రథమ విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న బాలరాజు గౌడ్‌

- పీయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ బాలరాజు గౌడ్‌

గద్వాల అర్బన్‌, జనవరి 20 : గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చిరపరిచితమైన కబడ్డీ క్రీడకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అవసరమని పాలమూరు విశ్వవిద్యాలయం ఫిజికల్‌ డైరెక్టర్‌ బాలరాజు గౌడ్‌ అన్నారు. అత్యంత ప్రాచీన ఆటగా ఉన్న కబడ్డీకి మన సమాజంలో మంచి గుర్తింపు ఉందని, క్రీడాకారులు సైతం కబడ్డీపై ఆసక్తి చూపుతుండటం అభినందనీయమన్నారు. గద్వాల చిన్న జాతర (సంతాణ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు) సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇన్‌డోర్‌ స్డేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు బుధవారం రాత్రి ముగిసాయి. పోటీల్లో ప్రథమ విజేతగా నల్గొండ జిల్లా జట్టు నిలవగా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తరఫున విజేతకు రూ.20,116తో పాటు ట్రోఫీని బాలరాజు గౌడ్‌ అందజేశారు. ద్వితీయ బహుమతి విజేతగా హైదరాబాద్‌ రైల్వే జట్లు నిలవగా మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ తరఫున రూ.15,116ను రిటైర్ట్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌, రిటైర్‌ పీడీ బద్రీనాథ్‌లు అందించారు. మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచిన గద్వాల, మూలమల్ల జట్లకు 18 వార్డు కౌన్సిలర్‌ నరహరి గౌడ్‌, చికెన్‌ వ్యాపారి టీ నగదు బహుమతి అందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-21T05:50:22+05:30 IST