ఆక్వా రైతులకు మరింత ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-06-18T05:14:41+05:30 IST

ఆక్వా రైతులను మరింత ప్రోత్సహించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ సూ చించారు. గురువారం మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆక్వా రైతులకు మరింత ప్రోత్సాహం
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌



కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, జూన్‌ 17: ఆక్వా రైతులను మరింత ప్రోత్సహించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌  సూ చించారు. గురువారం మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంతం అధికంగా ఉన్నందున..అందుకు తగ్గట్టు వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మంచి నీటి చేపల పెంప కంపై దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే రైతులకు అవ గాహన కల్పించి చేపలు పెంచేందుకు చేయూతనం దించాలని ఆదేశించారు. మత్స్యకారులకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. దీనిపై జేడీ స్పందిస్తూ వాటిని అందించేందుకు ప్రత్యేకంగా డీలర్లు ఉన్నట్టు వివరించారు. చేప పిల్లలను విరివిగా అందించాలని ఆదేశించారు. చేపల ఆహారం నాణ్యమైనదిగా ఉందో లేదో పరిశీలించాలని సూచించా రు. చేపలు, రొయ్యలకు తరుచూ ల్యాబ్‌లో పరీక్షలు చేసి మత్స్యకారులు, పెంపకందారులకు సలహాలు, సూచనలు అందించాలని చెప్పారు. చేపలు, రొయ్యల చెరువులు కోసం రైతులు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత 107 చెరువులకు జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్‌ ఇరిగేషన్‌ డీఈ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. 


కొవిడ్‌ బాధిత కుటుంబాలకు రుణాలు

కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు (బీసీలు)  రాయితీపై రుణాలు అందించనున్నట్లు  కలెక్టర్‌ శ్రీకేష్‌ బి. లఠ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కుటుంబానికి గరి ష్టంగా రూ.5లక్షల వరకు రుణం అందిస్తామన్నారు. చనిపో యిన వ్యక్తి కుటుంబ పోషణకర్త అయి ఉండాలని,  18 నుంచి 60 ఏళ్ల వయ సు, వార్షిక ఆదాయం రూ.3లక్షలు లోపు ఉండాలన్నారు. ఆధార్‌, రేషన్‌, బియ్యం కార్డులు, కరోనాతో మృతి చెందినట్లు ధ్రువపత్రంతో పాటు కుల ధ్రువపత్రం సమర్పించాలన్నారు.  దరఖాస్తులను ఈ నెల 22లోగా బీసీ కార్పొరేషన్‌ కార్యాలయానికి సమర్పించాలని కలెక్టర్‌ లఠ్కర్‌ తెలిపారు. 





Updated Date - 2021-06-18T05:14:41+05:30 IST