శ్యాండ్‌ ట్యాక్సీకి మరిన్ని రీచ్‌లు

ABN , First Publish Date - 2022-01-26T06:39:23+05:30 IST

జిల్లాలో శ్యాండ్‌ ట్యాక్సీ పాలసీ కోసం మానేరు వాగుపై మరికొన్ని ఇసుక రీచులను అధికారులు గుర్తించారు.

శ్యాండ్‌ ట్యాక్సీకి మరిన్ని రీచ్‌లు
శ్యాండ్‌ ట్యాక్సీ ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్‌ చేస్తున్న కూలీలు (ఫైల్‌)

- 9 రీచ్‌లను గుర్తించిన అధికారులు

- 15,89,490 క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు అనుమతి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో శ్యాండ్‌ ట్యాక్సీ పాలసీ కోసం మానేరు వాగుపై మరికొన్ని ఇసుక రీచులను అధికారులు గుర్తించారు. బుకింగ్‌ చేసుకున్న ఒకటి, రెండు రోజుల్లోనే ఇసుకను సరఫరా చేసే విధంగా రూ పొందించి అమలుచేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ లోపల పెద్దఎత్తున రెండు మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించాలని జిల్లాస్థాయి శ్యాండ్‌ కమిటీ నిర్ణయించింది. టీఎస్‌ఎండీసీకి కోటి 32 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీసుకవెళ్లేం దుకు జిల్లా అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో టెండర్లను ఆహ్వానించింది. అలాగే 2017 అప్పటి కలెక్టర్‌ డాక్టర్‌ ఆళగు వర్షిణి రూపొందించిన శ్యాండ్‌ ట్యాక్సీ పాలసీ జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. ఈ పాలసీ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా కావాల్సిన పరిమాణంలో బుక్‌ చేసుకున్న వెంటనే దూరాన్ని బట్టి ఆన్‌లైన్‌ జనరేట్‌ అయ్యే అమౌంట్‌ ను చెల్లించినట్లయితే ఒకటి, రెండు రోజుల్లో ట్రాక్టర్ల ద్వారా ఇంటికి సరఫరా చేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా సుమారు 800 ట్రాక్టర్ల యజమానులతో పాటు కూలీలకు ఉపాధి కలుగుతున్నది. ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా, అక్కమ ఇసుక రవాణా లేకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ పాలసీ దోహదపడుతున్నది. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో పలు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. మానేరు వాగు, హుస్సేనిమియా వాగు, గోదా వరి నదిపై ముర్మూర్‌ ప్రాంతంలో ఇసుక రీచులను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రీచుల నుంచి ఇసుకను తరలి స్తుంటారు. రీచ్‌ల వద్ద ఒప్పంద ఉద్యోగులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఒక ట్రాక్టర్‌ ట్రిప్పు ఇసుక 1800 నుంచి 3 వేల రూపాయలలోపే దూరాన్ని బట్టి లభిస్తున్నది. సీనరేజీ పన్నుల రూపేణా కూడా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్నది. తాజాగా గనులు, భూగర్భ శాఖాధికారు లు మానేరు వాగుపై ఇప్పుడున్న రీచ్‌ లకు తోడు మరికొన్ని ఇసుక రీచ్‌లను గుర్తించారు. సుల్తానా బాద్‌ మండలం గొల్లపల్లి చెక్‌డ్యామ్‌ లోపల 1,50, 080 క్యూబిక్‌ మీటర్లు, నీరుకుల్ల వద్ద 2.39.400, కదంబాపూర్‌ వద్ద 1,50,000, తొగర్రాయి వద్ద 2 లక్షలు, కనగర్తి వద్ద 2 లక్షలు, ఓదెల మండలం రూప్‌నారాయణ పేట వద్ద 1,50,000, గుంపుల వద్ద లక్ష, కిష్టపేట వద్ద 2 లక్షలు, ముత్తారం మం డలం ఓడేడు వద్ద 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, మొత్తం 15,89,490 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ను తర లించేందుకు జిల్లాస్థాయి శ్యాండ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రీచుల్లో ఇసుక అయి పోయిన తర్వాత కొత్త రీచ్‌ల్లో ఇసుక తరలింపును మొదలు పెట్టనున్నారు. స్థానిక అవసరాలకే గాకుం డా డబుల్‌ బెడ్‌రూముల ఇళ్ల నిర్మాణాలకు, ప్రభు త్వ అభివృద్ధి పనులకు శ్యాండ్‌ ట్యాక్సీ ద్వారా ఇసు కను కేటాయిస్తున్నారు. దీని ద్వారా ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుక రూ. 55కే లభిస్తుంది. టీఎస్‌ ఎండీసీ ద్వారా ఇసుక కోసం బుక్‌ చేసుకుంటే మాత్రం క్యూబిక్‌ మీటర్‌కు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా అవసరాలకు మాత్రమే శ్యాండ్‌ ట్యాక్సీ ఇసుక క్వారీల నుంచి ఇసుక ఇవ్వనున్నారు. 

Updated Date - 2022-01-26T06:39:23+05:30 IST