విమాన ప్రయాణికులకు మరింత భద్రత

ABN , First Publish Date - 2021-06-17T05:20:20+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కృతిమ మేధ అనాలిటిక్స్‌ పద్ధతిలో

విమాన ప్రయాణికులకు మరింత భద్రత
విమానాశ్రయంలో అనాలిటిక్స్‌ భద్రత ఏర్పాట్లు

శంషాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కృతిమ మేధ అనాలిటిక్స్‌ పద్ధతిలో భద్రత కల్పిస్తున్నట్టు విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్‌  బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు, ఎయిర్‌పోర్టులోని వివిధ ప్రదేశాల్లో చెకింగ్‌, ఇమ్మిగ్రేషన్‌ల వద్ద ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, రద్దీని నివారించడం, భద్రతకు కీలకంగా మారాయన్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం తాజాగా కృతిమ మేధ వీడియో అనాలిటిక్స్‌ కలిపిన క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టంను అమల్లోకి తెచ్చిందన్నారు. ఇది విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాల్లో ప్రయాణికులు వేచిఉండే సమయం, రద్దీ తగ్గుతుందన్నారు. దీనిని ఎయిర్‌పోర్టు నిర్వహణలో భాగస్వాములైన ఆల్‌గో విజన్‌ టెక్నాలజీ్‌సతో కలసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. కెమెరా ఆధారిత వీడియో అనాలిటిక్స్‌ ద్వారా ప్రయాణికులు వేచిఉండే సమయాన్ని పర్యవేక్షిస్తూ రద్దీని తగ్గించడంలో సహాయ పడుతుందన్నారు. ఈ అధునాతన పద్ధతి వివిధ కెమెరాల నుంచి అందే వీడియోలను విశ్లేషించి ప్రయాణికుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడానికి డీప్‌ లెర్నింగ్‌ బేస్డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ (ఏ1) మాడల్స్‌ను ఉపయోగిస్తారని తెలిపారు. 



Updated Date - 2021-06-17T05:20:20+05:30 IST