25 మందికి పైగానే అచ్చిరెడ్డి బాధితులు

ABN , First Publish Date - 2021-03-02T06:01:48+05:30 IST

అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంఽద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ పట్టణ పరిధిలోని భవానిపురానికి చెందిన కో నాల అచ్చిరెడ్డిని నల్లగొండ జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకోగా ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

25 మందికి పైగానే అచ్చిరెడ్డి బాధితులు

నిందితుడిపై 12 కేసులున్నట్లు సమాచారం

వివరాలు సేకరిస్తున్న జిల్లా పోలీసులు 

నల్లగొండ క్రైం, మార్చి 1 :  అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంఽద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ పట్టణ పరిధిలోని భవానిపురానికి చెందిన కో నాల అచ్చిరెడ్డిని నల్లగొండ జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకోగా ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అచ్చిరెడ్డి మో సాలకు బలైన బాధితులు సుమారు 25 మందికి పైగానే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తనకు పెద్ద వ్యక్తులు తెలుసని బిజినెస్‌ రంగంలో వాటాలు పెట్టిస్తానని పలువురిని అచ్చిరెడ్డి మోసం చేసి రూ.కోట్ల లో కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. నల్లగొండ పట్టణంలోని హానుమాన్‌ నగర్‌కు చెందిన సామినేని సాయి ఫిర్యాదుతో జిల్లా పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా అరెస్టు చేసి జిల్లాకు తరలించినట్లు సమచారం. అయితే పోలీసుల విచారణలో కొన్నింటిని అచ్చిరెడ్డి అంగీకరించినట్లు విశ్వసనీయ సమచారం. మరిన్ని వివరాలు రాబట్టే పని లో పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఉన్నత విద్యా వంతులను సైతం తన మాయమాటలతో మోసం చేసే నైజం అచ్చిరెడ్డిది కాగా బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ పోలీస్‌ స్టేషన్లలో సుమారు 12 కేసులు నమోదైనట్లు సమాచారం. 


 సినీఫక్కీలో రూ.6.40 లక్షలు చోరీ

నల్లగొండ టౌన్‌, మార్చి 1:  బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న ఓ వ్యక్తినుంచి సినీ ఫక్కీలో రూ.6.40లక్షలు చోరీ చేశా రు. ఈ ఘటన శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసు కుంది.  బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన చెరుకు నర్సయ్య నకిరేకల్‌ పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ.6.40 లక్షలను డ్రా చేసుకున్నాడు. నర్సయ్య తన మిత్రుడుతో కలసి అనంతారం గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలోని శాలిగౌరారం మండలం పెర్కకొండరాం సమీపంలో జాతీయ రహదారిపై బ్రిడ్జి ప నులు జరుగుతున్నాయి. దీంతో బ్రిడ్జిని దాటేందుకు  నెమ్మదిగా వెళుతున్నారు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు ఉన్న బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని నకిరేకల్‌ వైపు బైక్‌పై పారిపోయారు. వెంబడించినా ఫలితం లేకుం డా పోయిందని  బాధితులు తెలిఆపరు. శాలిగౌరారం పోలీసు స్టేషన్‌లో నర్సయ్య ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.హరిబాబు తెలిపారు.


ఉరేసుకుని కార్మికుడి బలవన్మరణం

చిట్యాల రూరల్‌, మార్చి 1: చిట్యాల మండలం ఏపూరు గ్రామ శివారు శివారులోని డీఈసీ కంపెనీ కార్మికుడు పేరేపల్లి గ్రామశివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్యాల ఏఎస్‌ఐ జోజి తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌ రాష్ట్రానికి చెందిన గజేంద్ర మహతో(28) ఏపూరు గ్రామ శివారులోని డీఈసీ కంపెనీలో రెండు నెలలు క్రితం కార్మికుడిగా చేరాడు. ఆదివారం సాయంత్రం పేరేపల్లి శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు రాత్రి సమయంలో అటువైపు నుంచి వెళుతుండగా చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. కంపెనీ సీనియర్‌ మేనేజర్‌ పులిగోని దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లఉ ఏఎస్‌ఐ పేర్కొన్నారు.


 కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ: పలువురికి గాయాలు                

దామరచర్ల, మార్చి 1: కూలీలతో వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం మండలకేంద్రం శివారులో చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన కూలీలు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో మిర్చి చేనులో పనులు చేసేందుకు ఆటోలో వెళ్లి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో యూటర్న్‌ తీసుకొంటున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో సోహైల్‌ అనే బాలుడి కాలుకు తీవ్ర గాయాలు కాగా, ఫయాజ్‌, మాతంగి రమాదేవి, బొంగరాల ఎల్లమ్మ, రమణలు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ వాహనంలో మిర్యాలగూడకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 చెరువులో పడి యువకుడి మృతి 

త్రిపురారం, ఫిబ్రవరి 1: ప్రమాదవశాత్తు చెరువులో పడి త్రిపురారం మండలం లోని కొణతాలపల్లిలో సోమవారం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెం దిన చిన్నాల నరేష్‌ (26) గేదెలు మేపుతున్నాడు.  అందులో ఓ గేదె పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లింది. దానిని బయటకు రప్పించే ప్రయత్నంలో నరేష్‌ చెరువు గుంత లోపడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాంమూర్తి తెలిపారు. 

Updated Date - 2021-03-02T06:01:48+05:30 IST