రాష్ట్రంలో 50కిపైగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-07-30T06:39:24+05:30 IST

దేశంలో ఎక్కడాలేని విఽధంగా తెలంగాణ రాష్ట్రంలో 50కిపైగా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో 50కిపైగా సంక్షేమ పథకాలు
మర్రిగూడలో ఆహారభద్రతకార్డులపంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటతో సమానంగా మునుగోడు అభివృద్ధికి కృషి

 విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి 

మర్రిగూడ/ నాంపల్లి, జూలై 29: దేశంలో ఎక్కడాలేని విఽధంగా తెలంగాణ రాష్ట్రంలో 50కిపైగా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని  విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.  మర్రిగూడ, నాంపల్లి మండలాల లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు, కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మర్రిగూడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠ శాలలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మర్రిగూడ, నాంపల్లి మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ రెండు మండలాలలో ఫ్లోరైడ్‌ విషపునీటిని తాగి ప్రజలు జీవచ్ఛవాలుగా మారారని, సమస్య శాశ్వత పరిష్కారం కోసం మిషన్‌ భగీరథ ద్వారా కృష్ణాజలాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. 2014కు ముందు ఉమ్మడిరాష్ట్రంలో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, గుక్కెడునీటి కోసం కిలోమీటర్ల దూరం ఆడబిడ్డలు పోయే పరిస్థితులు ఉండేవన్నారు. 1979లో మొదలైన ఫ్లోరైడ్‌ భూతం ఈ నియోజకవర్గం దాటి వెయ్యి గ్రామాల్లో విస్తరించిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరిన్‌ సమస్య పరిష్కారానికి మిషన్‌ భగిరఽథ  పథకాన్ని మునుగోడు నుంచే ప్రారంభించి, ఇంటింటికీ మంచి నీటిని అందిచిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. రైతు బిడ్డగా ఆలోచించి రైతులకు ఉచిత విద్యుత్‌,  లక్ష రూపాయల రుణ మాఫీ, రెండు విడతలుగా రైతు బంధు అమలు చేసి చరిత్ర సృష్టించారన్నారు. నాటి నుండి నేటి వరకు మునుగోడు అభివృద్ధి జరగలేదని, ఇకపై సూర్యాపేటతో సమానంగా మునుగోడు అభివృద్ధి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, టీఆర్‌ఎస్‌ మునుగోడు నియోజక ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ గోపీరాం, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, ఏంపీపీలు ఏడుదొడ్ల శ్వేత, మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీలు ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, పాశం సురేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పీనగంటి రజినీవెంకన్నగౌడ్‌, తహసీల్దార్‌లు లాల్‌బహదూర్‌, దేశ్యానాయక్‌, ఏంపీడీవోలు రమేష్‌దీన్‌దయాళ్‌, శేషుకుమార్‌,  ఊరుపక్క సరిత నగేష్‌, నల్లా యాదయ్యగౌడ్‌, బంతిలాల్‌, దంటు జగదీశ్వర్‌, కొలుకులపల్లి యాదయ్య, పానగంటి రజిత వెంకన్నగౌడ్‌ పాల్గొన్నారు. 

మంత్రి కాన్వాయిని అడ్డుకునేందుకు బీజేపీ నేతల యత్నం

మంత్రి జగదీష్‌రెడ్డి నాంపల్లి మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా బీజేపీ దళితమోర్చ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితద్రోహి అంటూ బీజేపీ నాయకులు మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి  బీజేపీ నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు నినాదాలు చేస్తుండగా అందరిని అరెస్ట్‌ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-30T06:39:24+05:30 IST