Kuwait కీలక ప్రకటన.. ఆ వలసదారులంతా నవంబర్ 1వ తారీఖులోపు కువైత్‌లోకి రాకపోతే..

ABN , First Publish Date - 2022-08-13T15:09:47+05:30 IST

రెసిడెన్సీ వీసాల విషయంలో కువైత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలలపాటు దేశం వెలుపల ఉన్న వారి రెసిడెన్సీ వీసాలను రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు వె

Kuwait కీలక ప్రకటన.. ఆ వలసదారులంతా నవంబర్ 1వ తారీఖులోపు కువైత్‌లోకి రాకపోతే..

ఎన్నారై డెస్క్: రెసిడెన్సీ వీసాల విషయంలో కువైత్ ప్రభుత్వం(Kuwait govt) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలలపాటు దేశం వెలుపల ఉన్న వారి రెసిడెన్సీ వీసాలను రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. 


ఎవరైనా ఆర్టికల్ 18 ప్రకారం( ప్రైవేటు రంగం) రెసిడెన్సీ వీసాలు పొంది.. తర్వాత 6 నెలలపాటు  కువైత్ వెలుపల ఉంటే.. సదరు వ్యక్తుల రెసిడెన్సీ పర్మిట్లు(Residence Permits) నవంబర్ 1 నుంచి రద్దు చేయాలని రెసిడెన్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డిసైడ్ అయింది. దీని ప్రకారం మే 1వ తేదీకి ముందు.. దేశాన్ని వీడిన వ్యక్తులు.. నవంబర్ 1వ తేదీలోపు కువైత్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో సదరు వ్యక్తుల రెసిడెన్సీ పర్మిట్లు రద్దు కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఇదే నిబంధనను ఈ ఏడాది చివరి నాటికి ఫ్యామిలీ వీసా(Family Visa)(డిపెండెంట్)‌కు కూడా వర్తింప చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 


Updated Date - 2022-08-13T15:09:47+05:30 IST