ప్రపంచవ్యాప్తంగా 6 వేలకు పైగా Monkeypox కేసులు.. త్వరలో WHO అత్యవసర సమావేశం

ABN , First Publish Date - 2022-07-08T05:03:17+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు సంఖ్య 6 వేలు దాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్త తాజాగా పేర్కొంది. వీటిలో దాదాపు 80 శాతం ఐరోపా ఖండంలోనే నమోదైనట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌లో మంకీపాక్స్ తీవ్రతను సమీక్షించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

ప్రపంచవ్యాప్తంగా 6 వేలకు పైగా Monkeypox కేసులు.. త్వరలో WHO అత్యవసర సమావేశం

ఎన్నారై డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్(Monkeypox) కేసులు సంఖ్య 6 వేలు దాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్త తాజాగా పేర్కొంది. వీటిలో దాదాపు 80 శాతం ఐరోపా ఖండంలోనే నమోదైనట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌లో మంకీపాక్స్ తీవ్రతను సమీక్షించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జులై 18 లేదా అంతకుమునుపే ఈ సమావేశం ఉండొచ్చని పేర్కొంది. మంకీపాక్స్ వ్యాప్తి తీవ్రత అత్యయిక స్థాయికి చేరుకుందా.. దీని వల్ల ప్రజారోగ్యం ప్రమాదం పడిందా లేదా అనేది ఈ సమావేశంలో చర్చకు రానుంది. 


మంకీపాక్స్‌పై జూన్ 27న చివరిసారిగా ప్రపంచఆరోగ్య సంస్థ సమావేశాన్ని నిర్వహించింది. అయితే.. మంకీపాక్స్ స్థితి అత్యయిక స్థితికి చేరుకోలేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథానమ్..సమావేశం తరువాత చెప్పారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. మంకీపాక్స్ నిర్ధారణ పరీక్షలు తగిన స్థాయిలో జరగట్లేదని, ఫలితంగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య.. క్షేత్రస్థాయిలోని పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించట్లేదన్నారు. గతంలోనూ ఆఫ్రికాలో మంకీపాక్స్ ప్రబలిన సందర్భాల్లో మరణాల శాతం 1గా నమోదైంది. ప్రస్తుతం రోగుల్లో ఓ మోస్తరు తీవ్రతతో వ్యాధి లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం మరణాలరేటు గతంలోనే కంటే తక్కువే ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. 

Updated Date - 2022-07-08T05:03:17+05:30 IST