ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఫాలోవర్లు సగం ఫేకేనట!

ABN , First Publish Date - 2022-05-03T01:07:19+05:30 IST

మస్క్ ఇటీవల ట్విటర్‌ను చేజిక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై సర్వత్రా రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్వీటర్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేస్తానన్న మస్క్‌కు కొందరు మద్దతు పలుకుతున్నారు..

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఫాలోవర్లు సగం ఫేకేనట!

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌‌కు కాబోయే అధినేత ఎలాన్ మస్క్‌కు ట్విట్టర్‌లో ఉన్న ఫాలోవర్లలో సగానికి పైగా ఫేక్ ఫాలోవర్లేనని ఒక సర్వే వెల్లడించింది. ప్రస్తుతం మస్క్‌ను ట్విట్టర్‌లో 90 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా, ఇందులో 53.3 మంది ఫేక్ లేదంటే స్పామ్, బాట్స్ ఖాతాలని  స్పార్క్ టోరో ఆడిట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి తమ అనుచురుల్లో ఎంత మంది నకిలీ ఫాలోవర్లు ఉన్నారో ఖాతాదారులు చూసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే స్పార్క్ టోరో ఆడిట్ వెల్లడించిన వివరాలు ఎంత వరకు నిజమనేది చెప్పలేమని అంటున్నారు. ఇటీవల మస్క్‌ను ఫాలో అవుతున్న సుమారు లక్ష మంది ఖాతాల నుంచి 2,000 మంది ఖాతాలను తాము విశ్లేషించామని.. ఇందులో స్పామ్, బాట్, లో క్వాలిటీ ఖాతాలు ఉన్నట్లు స్పార్క్ టోరో ఆడిట్‌ వెల్లడించింది.


మస్క్ ఇటీవల ట్విటర్‌ను చేజిక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై సర్వత్రా రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్వీటర్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేస్తానన్న మస్క్‌కు కొందరు మద్దతు పలుకుతున్నారు. ఈ వైఖరి అరాచకానికి దారి తీస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ట్విటర్‌ను లాభాల బాట పట్టిస్తానన్న మస్క్.. తదుపరి ఏం చేస్తారోననే సందేహం ట్విటర్‌ ఉద్యోగుల్లో వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయా లేదా అంటూ కొందరు ఏకంగా సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అంతర్గత మీటింగ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే.. ట్విటర్ ఉద్యోగుల పట్ల సంస్థ యాజమాన్యం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుందని పరాగ్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట.

Read more