Prophetపై వ్యాఖ్యలపై నిరసనలు...యూపీలో 130 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-11T12:55:47+05:30 IST

ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు....

Prophetపై వ్యాఖ్యలపై నిరసనలు...యూపీలో 130 మంది అరెస్ట్

లక్నో : ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు.అసలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయకుండా వారికి పోలీసు భద్రత కల్పించిన ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేసిన వారిని అరెస్ట్ చేశారు. యూపీలోని 6 జిల్లాల్లోని నగరాల్లో జరిగిన నిరసనల్లో 136మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లలో 10 మంది వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు ఇతర నగరాల్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత బీజేపీ నేతలు మహమ్మద్ ప్రవక్తపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నిరసనలు చెలరేగాయి.


ప్రయాగ్‌రాజ్‌లో కొన్ని మోటార్‌సైకిళ్లు, బండ్లను తగులబెట్టారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ఉపయోగించారు.ఈ నిరసనల్లో ఒక పోలీసు గాయపడ్డారని వారు తెలిపారు.రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి శుక్రవారం రాత్రి 9.45 గంటల వరకు 136 మంది నిరసనకారులను అరెస్టు చేశామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.సహారన్‌పూర్‌లో 45 మంది, ప్రయాగ్‌రాజ్‌లో 37 మంది, అంబేద్కర్ నగర్‌లో 23 మంది, హత్రాస్‌లో 20 మంది, మొరాదాబాద్‌లో ఏడుగురు, ఫిరోజాబాద్ జిల్లాలో నలుగురిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు.


బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నుపుర్ శర్మకు మరణశిక్ష విధించాలని సహరాన్‌పూర్‌లో నిరసనకారులు డిమాండ్ చేశారు.నుపుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్ మరియు లక్నోలో నిరసనలు కూడా జరిగాయి.ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 15 నిమిషాలకు పైగా రాళ్ల దాడి కొనసాగింది. ప్రధాన రహదారిపై మోహరించిన పోలీసు సిబ్బందిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని, ఎక్కువ మంది రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని పోలీసులు తెలిపారు.దేవ్‌బంద్ ప్రాంతంలో కొందరు మదర్సా విద్యార్థులు నినాదాలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి, మరోసారి హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు.

 

Updated Date - 2022-06-11T12:55:47+05:30 IST